‘కేజీఎఫ్’ బ్యూటీ రెండు సినిమాలకే సైలెంట్ అయ్యిందిగా.. శ్రీనిధి శెట్టి క్యూట్ లుక్స్

First Published | Jun 29, 2023, 3:21 PM IST

తొలిచిత్రంతో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. 
 

కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. తొలిచిత్రంతోనే దేశ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది. తన నటనతో మెస్మరైజ్ చేసింది. వెండితెరపై తనదైన శైలిని ప్రదర్శించి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది.
 

కర్ణాటకకు చెందిన శ్రీనిధి శెట్టి మోడల్ గా కెరీర్ ను ప్రారంభించింది. మిస్ సుప్రనేషనల్ 2016 విన్నర్ గా నిలిచింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఆఫర్లు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ‘కేజీఎఫ్’లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.
 


KGF ఛాప్టర్ 1, ఛాప్టర్ 2లో రీనా దేశాయ్ పాత్రలో ఆకట్టుుకుంది. తన అటిట్యూడ్ తో ఆడియెన్స్ కు మరింతగా నచ్చేసింది. కేజీఎప్ తర్వాత ఒక్క సినిమాలోనే అలరించింది. తమిళ స్టార్ విక్రమ్ సరసన ‘కోబ్రా’లో మెరిసి మాయమైంది. ఆ తర్వాత ఎలాంటి చిత్రాల్లో నటిస్తున్నట్టు అప్డేట్ లేదు. 
 

కేజీఎఫ్ తో చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ గా మారిన ఈ ముద్దుగుమ్మ  రెండు సినిమాల తర్వాత సైలెంట్ అయ్యిపోయింది. ఎందుకో ఈ బ్యూటీకి ఆఫర్లు అంతగా రావడం లేదు. దీంతో ఈమె కెరీర్ ముందుకు ఎలా వెళ్తుందోనని సందేహిస్తున్నారు. మరోవైపు ఏదైనా బిగ్ ప్రాజెక్ట్ తో వస్తుందా? అనే ఆసక్తి కూడా నెలకొంది.
 

ప్రస్తుతానికి శ్రీనిధి చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. ఈ క్రమంలో కనీసం ఫ్యాన్స్ కైనా టచ్ లో ఉండేందుకు నిత్యం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. వరుస పోస్టులతో యంగ్ బ్యూటీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. గ్లామర్ షోకు దూరంగా ఉంటున్న శ్రీనిధి అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
 

ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడంతో పాటు దర్శక నిర్మాత కంట్లో పడేందుకు నిత్యం ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా క్యాజువల్ లుక్ లో మెరిసింది. క్యూట్ లుక్స్ తో కుర్ర హృదయాలను దోచుకుంది. బ్యూటీఫుల్ స్మైల్ తో చూపు తిప్పుకోకుండా చేసింది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు లైక్ చేస్తున్నారు. సింపుల్ లుక్ లోనూ అట్రాక్ట్ చేస్తుందంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక శ్రీనిధికి ఇన్ స్టాలో మాత్రం 5 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్  ఉన్నారు. పద్ధతిగా మెరుస్తూనే ఇంత క్రేజ్ దక్కించుకుంది. 

Latest Videos

click me!