‘ఇస్మార్ట్ శంకర్’తో ఫామ్ లోకి వచ్చిన స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు మళ్లీ కష్టకాలం వచ్చింది. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - పూరీ కాంబినేషన్ లో వచ్చిన భారీ చిత్రం ‘లైగర్’ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, పూరీ కూడా బాలీవుడ్ లో హవా క్రియేట్ చేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.