కథల విషయంలో జాగ్రత్త పడుతున్న రౌడీ.. కొత్త ట్రెండ్ షురూ చేసిన విజయ్ దేవరకొండ.!

Published : Sep 26, 2022, 06:30 PM IST

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ కు తెర తీశారు. వరుస ఫ్లాప్ లను ఎదుర్కొంటున్న రౌడీ కథల విషయంలో రూటు మార్చాడు. ఇకపై కేరీర్ లో మరింత శ్రద్ధగా, ఆచీతూచి అడుగేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.  

PREV
17
కథల విషయంలో జాగ్రత్త పడుతున్న రౌడీ.. కొత్త ట్రెండ్ షురూ చేసిన విజయ్ దేవరకొండ.!

వరుస ఫ్లాప్ లతో విసుగెత్తిపోయాడు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఎలాంటి సినిమా చేసినా బెడిసికొడుతోంది. ఇటీవల ఎంతో హైప్ క్రియేట్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లైగర్’(Liger) కూడా నిరాశే మిగిల్చింది. ఈ మూవీకోసం రెండేండ్ల పాటు ఎంతో శ్రమించిన రౌడీకి ప్రతికూల ఫలితాలే అందాయి.  
 

27

‘లైగర్’కు ముందుకు వచ్చిన నాలుగు చిత్రాలు ‘నోటా’, ‘టాక్సీవాలా’,‘డియర్ కామ్రేడ్’,‘వరల్డ్ ఫేమస్ లవర్’ కూడా ఆశించినన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. మరీ ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లైగర్’ ఫలితాల తర్వాత విజయ్ చాలా అప్సెట్ అయ్యాడు.

37

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నియమాన్ని ప్రస్తుతం ఆయన కేరీర్ లో అవలంభిస్తున్నారు. వరుస ఫ్లాప్స్ ఇస్తున్నప్పటికీ యూత్ లో విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇదే కొనసాగితే మాత్రం రౌడీ క్రేజ్ కొద్దికొద్దిగా తగ్గే ప్రమాదం లేకపోలేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడే కేరీర్ ను మళ్లీ దారిలో పెట్టాలని భావిస్తున్నారు. 

47

కేరీర్ విషయంలో రౌడీ స్టార్ తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా కథల విషయంలో మరింతగా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. దీంతో తను చేయబోయే సినిమా కథల ఎంపిక బాధ్యతను తండ్రి గోవర్థన్ రావు (Govardhan Rao)కు అప్పగించారని టాక్ వినిపిస్తోంది. తండ్రి విన్నాకే విజయ్ వింటున్నాడంట. ఇప్పటికే గోవర్థన్ ఒకటి రెండు కథలను విన్నారని తెలుస్తోంది.
 

57

అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోల కొడుకులు, బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరోలు వారి సినిమా కథలను వాళ్లే ఎంపిక చేసుకుంటున్నారు. ఆ బాధ్యతను పూర్తిగా వారి భుజాలపైనే వేసుకుంటున్నారు. మొదట్లో విజయ్ దేవరకొండ కూడా అదే ట్రెండ్ ఫాలో అయినా.. కలిసి రాకపోవడంతో ఆ బాధ్యతలను తండ్రికి అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది.

67

గోవర్థన్ రావుకు ఇండస్ట్రీలో టీవీ సీరియల్ డైరెక్టర్ గా అనుభవం ఉన్న విషయం తెలిసిందే. ఆయన కూడా సరైన సక్సెస్ అందుకోలేక కేరీర్ ను వదిలేశాడు. కానీ విజయ్ ఫామ్ లోకి రావడం, స్టార్ హీరో స్థాయిలో క్రేజ్ సంపాదించుకోవడంలో ఆయన సలహాలు, సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం రౌడీ స్టార్ కు బ్యాడ్ టైమ్ నడుస్తుండటంతో తనవంతుగా సహకరిస్తున్నారంట. 
 

77

ఇండస్ట్రీలో ఇదొక కొత్త సంప్రదాయానికి తెర తీసిందని చెప్పాలి. స్టార్ హీరో అయినప్పటికీ తన తండ్రి కథ విన్నాకే.. విజయ్ వరకు వెళ్తుండటం కొత్త ట్రెండ్ కు దారి తీసింది. ఏదేమైనా విజయ్ కు మళ్లీ మంచి హిట్ పడాలని  అభిమానులు కోరుకుంటున్నారు. రాబోతున్న చిత్రాలు తప్పకుండా భారీ సక్సెస్ ను సాధిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ ‘ఖుషీ’(Khushi) చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories