ఎన్టీఆర్ కు పార్టీ పెట్టాలనే ఆలోచన ... షూటింగ్ లో జరిగిన సంఘటన

Published : Jun 05, 2024, 02:42 PM IST

 ఆ రోజు ఎన్టీఆర్ కు తెలుగుదేశం అనే పార్టీ పెట్టాలనే ఆలోచన రావటంతో మొదలైన ప్రస్దానం ఇప్పటిదాకా సాగుతోందంటున్నారు. 

PREV
113
 ఎన్టీఆర్ కు పార్టీ పెట్టాలనే ఆలోచన ... షూటింగ్ లో జరిగిన సంఘటన


ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం కూటమి సంచలనం విజయం దక్కించుకోవటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంసంగా మారింది. పొత్తులో భాగంగా 144 శాసనసభ స్థానాల్లో పోటీచేసిన టీడీపీ130కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. జనసేన పోటీచేసిన 21 స్థానాల్లో విజయం సాధించింది. 

213
Sr NTR

అసలు తెలుగుదేశం పార్టీ గురించి ,అన్నగారు గురించి జనం సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు ఎన్టీఆర్ కు తెలుగుదేశం అనే పార్టీ పెట్టాలనే ఆలోచన రావటంతో మొదలైన ప్రస్దానం ఇప్పటిదాకా సాగుతోందంటున్నారు. ఈ నేపధ్యంలో అసలు తెలుగుదేశం పార్టీ పెట్టాలనే ఆలోచన వచ్చిన రోజు ఏం జరిగింది. ఎలా ఎన్టీఆర్ కు ఈ ఆలోచన వచ్చిందో చూద్దాం. 
 

313

 
 నవరస నటనా సార్వభౌముడుగా పేరు తెచ్చుకున్నారు ఎన్‌.టి.ఆర్‌. అప్పటికే అనేక పౌరాణాక, సామాజిక చిత్రాల్లో నటించారు. అలాగే అనేక రాజకీయ కథల్లో నటించారు. తన నటించే చిత్రాల్లో ఎక్కడ రాజకీయాలపై వ్యంగ్య బాణాలు వేయాలన్నా వెనకాడేవారు కాదు. అప్పటి  కుళ్ళు రాజకీయాలపైనా, వ్యవన్గపైనా తిరుగుబాటుచేసే పాత్రలే ఎక్కువగా ఆయన సోషల్ చిత్రాల్లో నటించినవి.  

413


అలా ఆయా చిత్ర సందర్బాలలో అంకురించి అతని మనస్సును తొందరపెడుతున్న భావాలను మొదటిసారిగా ఒక షూటింగ్‌ లో ఎన్‌.టి.ఆర్‌. బయటపెట్టారు.  అవుట్ డోర్‌ షూటింగ్‌ కోసం ఊటీ, కులూ మనాలికి   వెళ్ళినప్పుడు జరిగిందా సంఘటన. అక్టోబర్ 1981లో ఊటీలో ఒక  ఆ రోజు ఊటీలో "సర్దార్ పాపారాయుడు" అనే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పార్టీ గురించిన ఆలోచన బయిటకు వచ్చింది. 
 

513

సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, దౌర్జన్యాలను తుదముట్టించేందుకు అంకితభావంతో పనిచేసిన సర్దార్ పాపారాయుడు పాత్రలో శ్రీ ఎన్టీ రామారావు నటించారు.ఎన్నో సామజిక సమస్యలను దాసరి ఇందులో ప్రధాన కథకు ముడిపెట్టిన తీరు నభూతో నభవిష్యత్.  ఆ సినిమా షూటింగ్ విరామ సమయంలో. శ్రీ ఎన్టీఆర్ కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని, ఈ సన్నివేశంలోని డైలాగులను గుర్తుచేసుకున్నారు. 

613


ఆ సమయంలో అక్కడికి కొందరు జర్నలిస్టులు రావడంతో ఎన్టీఆర్ వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్‌తో సంభాషిస్తున్నప్పుడు ఒక జర్నలిస్ట్ ఎన్టీఆర్‌తో "సార్, మరో ఆరు నెలల్లో మీకు అరవై ఏళ్లు వస్తాయి, దాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు ఏదైనా ముఖ్యమైన మరియు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారా?"

713


ఎన్టీఆర్ కాసేపు ఆలోచించి జర్నలిస్టుకు సమాధానమిస్తూ "నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు మాట్లాడే ప్రజలు నన్ను గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్నారు మరియు వారి హృదయాలలో ఆదరిస్తున్నారు. వారు చాలా ప్రేమను కురిపించారు. నేను నటించిన సినిమాలను చూసి నన్ను భాగ్యవంతుడుని చేసారు. నేను ప్రజలకు రుణపడి ఉంటాను, నా పుట్టిన రోజు నుండి నెలలో పదిహేను రోజులు ప్రజల సేవలో గడపాలని కోరుకుంటున్నాను అన్నారు.

813


ఎన్టీఆర్ కు ఓ అలవాటు ఉంది. తను ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దానికి ఎట్టి పరిస్దితుల్లో అయినా కట్టుబడి ఉంటారు. అలాగే ఆయన ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరుస్తాడు. దాంతో ఎన్టీఆర్ నోటి వెంట వచ్చిన ఈ మాటను సినిమా పత్రికలు అన్ని పత్రికలు ఉత్కంఠభరితమైన వార్తగా ప్రెజెంట్ చేస్తూ ప్రచురించాయి. 

913

శ్రీ ఎన్టీఆర్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు నెల్లూరుకు చెందిన ఓ రాజకీయ దినపత్రిక ప్రకటించింది. ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. ప్రజలు ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించుకోవడం ప్రారంభించారు.
 

1013

ఇది జరగటానికి కొంతకాలం ముందే ఓ చిత్రం షూటింగ్‌ లోకేషన్‌ లో బి.వి. మోహన్‌ రెడ్డి అనే మిత్రునితో ఎన్టీఆర్   "తెలుగు ప్రజలు" నన్ను ఇంతగా ఆదరించారు, అభిమానించి అందలం ఎక్కించారు. పేరు ప్రతిష్ట, కీర్తి సిరిసంపదలు అన్నీ  ఇచ్చారు. వారికి నేను ఏమి బదులిచ్చి రుణం తీర్చుకోగలను" అని  వ్యాఖ్యానించారు. బీవీ మోహన్ రెడ్డి మంచి జ్యోతిష్యుడు. ఆయన మాట అంటే ఎన్టీఆర్‌కు గురి. 

1113


 
ఎన్టీఆర్ మాటలు విన్న బీవీ మోహన్ రెడ్డి   " మీరు కన్తుక రాజకీయ రంగప్రవేశం చేస్తేప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు. ఆంధ్ర ర్యాష్టానికి మీరే ముఖ్యమంత్రి" అని తన జ్యోతిషం వివరించారు.  అప్పటికి మనసులో ఉందేమో కానీ  1980 ప్రాంతాలలో "సర్దార్‌ పాపారాయుడు" చిత్రం కోసం ఊటీలో షూటింగ్‌ లో తన రాజకీయ ఆలోచనలను ఇలా  మెల్లగా బయట పెట్టడం ప్రారంభించారు. 

1213


అంతేకాకుండా మాటల్లో మాటగా ఆనాటి రాజకీయ వ్యవస్థలోని అస్తవ్యస్త పరిస్తితులను తలచుకుని బాధపడ్డారు. ఈ వార్త ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించింది. తర్వాత చంద్రబాబునాయుడు అల్లుడు కావడం ఆయన రాజకీయ రంగప్రవేశాన్ని అమితంగా ప్రభావితం చేసింది. కాంగ్రేస్‌ లోని అస్టిర ధోరణులకు విసిగి చాలా మంది ప్రాంతీయపార్లీల గురించి చర్చించసాగారు. 
 

1313
Stars in Lord Shiva Role


అల్లుడు అయిన తర్వాత చంద్రబాబు కూడా ఆయనతో తరచుగా ఈ విషయంలో చర్చించేవారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి సంచలనం సృష్టించిన విషయం కూడా తెలిసిందే. ఏదైమైనా మొదట జోస్యం చెప్పిన బీవీ మోహన్ రెడ్డి తర్వాత మంత్రి అయ్యారు. ఆయన కుమారుడు జయనాగేశ్వర్ రెడ్డి ఇప్పటికీ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. 

click me!

Recommended Stories