ఇప్పటికే మన దర్శకులు చాలా మందిస్టార్ హీరోయిన్లు ను తల్లి పాత్రలవైపు మళ్ళించారు. చాలా కాలంగా తల్లి పాత్రలు చేయం అని పట్టు పట్టి కూర్చున్న టబు లాంటివారి చేత కూడా తల్లి పాత్రలు వేయించారు మన తెలుగు దర్శకులు. అయితే మీన,జ్యోతిక, భూమిక లాంటి కొంత మంది తారలు ఇంకా తల్లి పాత్రల్లోకి షిప్ట్ అవ్వలేదు. ఇక వీరిలో జ్యోతిక ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో అదరగొడుతూనే ఉంది. ఇక తాజాగా జ్యోతికను తల్లి పాత్రలవైపుమళ్ళించే ప్రయత్నం టాలీవుడ్ లో జరుగుతున్నట్టు తెలుస్తోంది.