శ్రీకృష్ణుడుగా చేయటానికి ఎన్టీఆర్ భయపడ్డారా, కారణం ఆ రెండు చిత్రాలే?

First Published Jun 5, 2024, 2:40 PM IST

మాయాబజార్ లో కృష్ణుడుగా ఎన్టీఆర్   తప్పించి వేరే ఎవరూ గుర్తుకు రారు. ఆహార్యము, అంగికము, వాచికము, సాత్వికము సమపాళ్లలో ...


ఎన్టీఆర్ అంటే రాముడు..ఎన్టీఆర్ అంటే కృష్ణుడు ఇలా అన్నగారే. వెండితెరపై పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు ఆయన. ఆయన  ఏ పాత్రయినా ఆయన చేస్తే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. అందుకే  విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగు ప్రేక్షకుల్లో అన్నగారి స్థానం చిరస్మరణీయంగా నిలిచారు. రాముడు, కృష్ణుడు, భీముడు, కర్ణుడు ఇలా పౌరాణిక పాత్రల్లో ఆయన్ను తప్ప వేరే వారిని ఊహలో కూడా ఊహించలేము మనము. అలాంటి అన్నగారు మొదట్లో కృష్ణుడు వేషం వేయటానికి చాలా భయపడ్డారంటారు. అందుకు కారణం సీనియర్స్ చెప్తూంటారు. అవేమిటో చూద్దాం.

Stars in Lord Shiva Role


అలనాటి సినిమాల్లోని కొన్ని విషయాలు ఇప్పటికీ ఇంట్రస్టింగ్ గానే ఉంటాయి. అందులోనూ క్లాసిక్స్ అనదగ్గ మాయాబజార్ వంటి చిత్రాలు గురించి ఎన్ని సార్లు చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. మాయాబజార్ లో కృష్ణుడుగా ఎన్టీఆర్   తప్పించి వేరే ఎవరూ గుర్తుకు రారు. ఆహార్యము, అంగికము, వాచికము, సాత్వికము సమపాళ్లలో పోతపోస్తే వచ్చిన రూపమే ఎన్టీఆర్ కావటమే అందుకు కారణం. 


అయితే మాయాబజార్ చిత్రంలో కృష్ణుడుగా వేయటానికి ముందే ఎన్టీఆర్ మరో రెండు సినిమాల్లో కృష్ణుడుగా కనిపించారు. ఇద్దరు పెళ్లాలు, సొంత ఊరు అనే సినిమాల్లో ఆయన కొన్ని సీక్వెన్స్ లలో కృష్ణుడుగా ఆయన తెరపై కనపడగానే థియేటర్ లో జనం గోల గోల చేసారు. ఆ విషయం ఎన్టీఆర్ దాకా వచ్చింది. దాంతో ఆయన డైలమోలో పడ్డారు. 


ఆ పాత్ర ధారణ బాగోలేదా, మేకప్ బాగోలేదా లేక వేరే కారణమా అనేది ఎన్టీఆర్ కు అర్దం కాలేదు. రెండు సినిమాల్లోనూ నెగిటివ్ స్పందన వచ్చింది. దాంతో ఎన్టీఆర్ వచ్చి ఇదే విషయం మాయాబజార్ నిర్మాతలు అయిన చక్రపాణి, నాగిరెడ్డి గార్ల దగ్గర చెప్పటం జరిగింది. నేను కృష్ణుడుగా కనిపిస్తే సినిమాకు మైనస్ అవుతుందేమో అన్నారు.  దాంతో వాళ్లు సరే ఓ పని చేద్దాం ముందు కొన్ని లుక్స్ టెస్ట్ చేసి అంతా ఓకే అనుకున్నాకే ముందుకు వెళ్దాం అని ధైర్యం చెప్పారు.


కళా దర్శకుడు మాధవి పెద్ది గోఖలే గారి చేత కృష్ణుడుకి సంభందించి ఆరేడు స్కెచ్ లు వేయించారు. అనేక డిస్కషన్స్, తర్జనభర్జనలు పడి లుక్ ఫైనల్ చేసారు.ఆ స్కెచ్ కు తగినట్లుగా దాన్ని దగ్గరపెట్టుకుని పీతాంబరం, భక్తవత్సలం మేకప్ వేసారు. అలా ఆ మేకప్ లో సెట్ లోకి వచ్చేసరికి శ్రీకృష్ణ పాత్ర ధారిగా ఎన్టీఆర్ ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యారు అనేసరికి కాన్ఫిడెన్స్ వచ్చింది.


ఇంక ఆ కష్టం వృధా పోలేదు. కృష్ణుడుగా మాయాబజార్ లో ఎన్టీఆర్ ఎంతలా క్లిక్ అయ్యారంటే ఆయన కృష్ణుడుగా ఉన్న ఫొటోలతో క్యాలెండర్స్ ప్రింట్ చేసారు. చాలా మంది వాటిని పూజా గదుల్లో పెట్టుకున్నారు. ఎన్నో వేల కాపీలు ఆ క్యాలెండర్స్ అమ్ముడుపోయాయి. ఆ తర్వాత కృష్ణుడుగా చేయాలంటే ఎన్టీఆర్ మాత్రమే చేయాలి. వేరే ఎవరు చేసినా ఆ దైవత్వం కనపడదు అనే స్దాయికి వెళ్లిపోయింది. 
 

అప్పటి నుంచి దాదాపు పాతికేళ్ళ పైచిలుకు కాలంలో పౌరాణిక చిత్రాల్లో ఏకంగా 19 సార్లు అదే పాత్ర పోషించారు (మరో 10కి పైగా పౌరాణికేతర చిత్రాల్లో శ్రీకృష్ణుడి గెట్‌పలో కనిపించారు). పెరిగిన వయసుతో నిమిత్తం లేకుండా, వేసిన ప్రతిసారీ జనం చేతులెత్తి మొక్కేలా కనిపించారు, నటించారు. ఇలా ఒకే ఆహార్యంతో, ఒకే పాత్రను ఇన్నిసార్లు ఒక నటుడు పోషించడం, ప్రజల్ని మెప్పించడం ప్రపంచ సినీ చరిత్రలోనే అపూర్వం. 


అలా మాయాబజార్ కృష్ణుడు, లవకుశ రాముడు, పాండవ వనవాసం భీముడు, దానవీరశూరకర్ణ దుర్యోధనుడు, సీతారామకళ్యాణం రావణుడు, ఇలా నాయకులు, ప్రతినాయకులు అందరూ రామారావులే అన్నట్లుగా ఎన్టీఆర్ దశ కొనసాగింది. ఆయన అభిమాన జనానికి ఎన్టీఆర్ యుగపురుషుడు- కారణ జన్ముడు గా ఈ రోజుకు కొలవబడుతున్నారంటే ఆయన చేసిన ఇలాంటి పాత్రలే అనటంలో సందేహం లేదు.
 

ఏదైమైనా కృష్ణుడంటే  మ‌నంద‌రికీ ఠ‌క్కున గుర్తుకొచ్చే రూపం పెద్దాయన రామారావుదే. ఆయన తరువాత చాలా మంది ఆపాత్రలో మెప్పించారు కాని. రామారవు చేసినంతగా ఎవరూ చేయలేకపోయారు. పెద్దాయన దాదాపు 18 సినిమాల్లో కృష్ణుడిగా నటించి మెప్పించారు. భగవస్వరూపుడిగా ఎన్టీఆర్ ఇప్పటికీ కొలవబడుతున్నారు. 
 

 దివంగత, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామరావు (Sr NTR). ఎన్నో పాత్రలో మెప్పించిన అన్నగారు రాముడి పాత్రలో దైవస్వరూపంలా మెరిశారు. 1959లో విడుదలైన సంపూర్ణ రామాయణంలో తొలిసారిగా రాముడిగా కనిపించారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీరామ పట్టాభిషేకం’లోనూ రాముడి పాత్రలో అలరించారు. ఆయన రాముడి వేషం కడితే ప్రేక్షకులు వెండితెరకే హారతి ఇచ్చారంటే ఎంతలా ఇష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. 
 

Latest Videos

click me!