చిరంజీవి ఫస్ట్ సినిమా విషయంలో జరిగిందే, సాయి దుర్గ తేజ్‌కి కూడా జరిగింది? ఇది నిజంగా ఆశ్చర్యమే!

First Published | Nov 14, 2024, 8:32 PM IST

చిరంజీవి మేనల్లుడు, హీరో సాయి దుర్గ తేజ్‌ హీరోగా పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. అయితే చిరంజీవి మొదటి సినిమా సమయంలో జరిగిందే సాయి మొదటి సినిమా విషయంలో జరగడం యాదృశ్చికం. 

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడిగా చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు సాయిదుర్గ తేజ్‌(సాయి ధరమ్‌ తేజ్‌). చిరు చెల్లి కొడుకు సాయి దుర్గ తేజ్‌ అనే విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు తేజ్‌. ఓ రకంగా ఆయనకు పునర్జన్మ అనే చెప్పాలి. మెగా ఫ్యామిలీ అండగా ఉన్నారు కాబట్టే ఆయన ఇప్పుడు ఈ స్థాయిలో, ఈ స్థితిలో ఉన్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

సాయిదుర్గ తేజ్‌లో మేనమామ పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన డాన్స్ స్టయిల్‌ చిరంజీవిని పోలి ఉంటుంది. వాకింగ్‌ స్టయిల్‌, డైలాగ్‌ డెలివరీ మాత్రమే కాదు, ముఖ కవలికలు కూడా చిరుకి దగ్గరగా ఉంటాయి. మేనమామ పోలికలు మాత్రమే సేమ్‌ కాదు, కెరీర్‌ పరంగానూ ఇద్దరికి ఒకేలా జరిగింది. ఇద్దరికి మొదటి సినిమా విషయంలో ఒకేలా జరిగింది. మరి చిరంజీవికి ఏం జరిగింది? సాయిదుర్గ తేజ్‌కి ఏం రిపీట్‌ అయ్యిందనేది చూస్తే, 
 


చిరంజీవి నటుడిగా నటించిన తొలి సినిమా `పునాదిరాళ్లు`. అంటే ఆయన సైన్‌ చేసి షూటింగ్‌లో పాల్గొన్న మూవీ ఇదే. కానీ ఏడాది తర్వాత రిలీజ్‌ అయ్యింది. దానికంటే ముందు `ప్రాణం ఖరీదు` రిలీజ్‌ కాగా, ఆ తర్వాత నాలుగైదు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. అనంతరం `పునాదిరాళ్లు` రిలీజ్‌ అయ్యింది.

ఇందులో చిరంజీవి పాత్రకి పెద్దగా గుర్తింపులేదు. కానీ చిరంజీవిలోని స్పార్క్, ఎనర్జీ, నటన, డాన్సులు చూసిన మేకర్స్ ముందే వరుసగా ఆఫర్లు ఇచ్చారు. మొదట విడుదలైన `ప్రాణం ఖరీదు` మాత్రం మంచి విజయాన్ని సాధించి చిరంజీవికి ఆ సమయంలో బెస్ట్ ఇంట్రడక్షన్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. 

సరిగ్గా సాయి దుర్గ తేజ్‌ విషయంలో కూడా అలానే జరిగింది. ఆయన హీరోగా పరిచయం అవుతూ నటించిన మూవీ `రేయ్`. వైవీఎస్‌ చౌదరీ రూపొందించిన ఈ చిత్రం షూటింగ్‌ మొదట ప్రారంభమైంది. కానీ అనేక కారణాలతో లేట్‌గా రిలీజ్‌ అయ్యింది. దీంతో ఆ తర్వాత స్టార్ట్ అయిన `పిల్లా నువ్వు లేని జీవితం` మూవీ మొదట రిలీజ్‌ అయ్యింది.

దీనికి ఏ ఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహించగా, రెజీనా కేసాంద్రా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ హిట్‌ అయి సాయి దుర్గ తేజ్‌కి మంచి ఇంట్రడక్షన్‌ని ఇచ్చింది. అయితే ఆ తర్వాత రిలీజ్‌ అయిన `రేయ్‌` మూవీ డిజాస్టర్ అయ్యింది. సాయి తేజ్‌ ఫస్ట్ మూవీ `పిల్లా నువ్వు లేని జీవితం` విడుదలై నేటితో పదేళ్లు. ఇది 2014 నవంబర్ 14న విడుదల కావడం విశేషం. ఇలా సాయి తేజ్‌ హీరోగా వెండితెరకు పరిచయమై పదేళ్లు పూర్తి చేసుకోవడం విశేషం. 
 

ఒక్కో సినిమాతో తనని తాను నటుడిగా, హీరోగా మలుచుకుంటూ వచ్చాడు సాయి దుర్గ తేజ్‌. `సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌`తో మరో హిట్‌ని అందుకున్నారు. `సుప్రీమ్‌`తో ఇంకో హిట్‌ పడింది. సాయి దుర్గతేజ్‌ని హీరోగా నిలబెట్టింది. ఇక తిరుగులేదనే కాన్ఫిడెన్స్ అటు చిరంజీవికి, ఇటు మేకర్స్, సాయికి ఇచ్చింది. అయితే ఆ తర్వాత మాత్రం వరుసగా దెబ్బలు తినాల్సి వచ్చింది. `తిక్క`, `విన్నర్‌`, `నక్షత్రం`, `జవాన్‌`, `ఇంటలిజెంట్‌`, `తేజ్‌ ఐ లవ్యూ` సినిమాలు డిజప్పాయింట్‌ చేశాయి.

ఈ క్రమంలో `చిత్రలహరి` హిట్‌తో కమ్‌ బ్యాక్‌ ఇచ్చాడు సాయి. `ప్రతి రోజు పండగే`, `సోలో బ్రతుకే సో బెటర్‌` చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్ కొట్టాడు. `రిపబ్లిక్‌` పెద్దగా ఆడలేదు. కానీ `విరూపాక్ష`తో మాత్రం అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ ఇచ్చాడు. తనకు యాక్సిడెంట్ తర్వాత విడుదలైన ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. సుమారు వంద కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. 
 

మరోవైపు మేనమామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి నటించాలనేది సాయి డ్రీమ్‌.  `బ్రో` చిత్రంతో ఆ డ్రీమ్ నెరవేర్చుకున్నారు సాయిదుర్గ తేజ్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 18వ సినిమా `ఎస్ డీటీ 18` భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది.

తన సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలతోనూ ప్రజల మనసులు గెల్చుకున్నారు సాయిదుర్గ తేజ్. ఆయన 10 ఏళ్ల నట ప్రయాణం సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సహ నటీనటులు, దర్శక నిర్మాతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read more: నాగచైతన్య, సిద్ధార్థ కాదు.. సమంత ఫస్ట్ క్రష్‌ ఎవరో తెలుసా? రెండేళ్లు వెంటపడ్డాడు, తీరా అడిగితే

also read: `దేశముదురు` సినిమాని చేయాల్సింది ఏ హీరో తెలుసా? సూపర్‌ స్టార్‌ కావాల్సింది, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అయ్యాడు!
 

Latest Videos

click me!