తాను బస్ దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, రోజూ తన వెంటనే వెనకాల నడుచుకుటూ వచ్చేవాడని చెప్పింది. రెండేళ్లపాటు నడుచుకుంటూ వచ్చినా ఏ రోజూ తనతో మాట్లాడలేదట. దీంతో సమంతకి డౌట్ వచ్చింది. ఏంటి? ఏం మాట్లాడటలేదని చివరికి అడిగిందట. ఏంటి ఫాలో అవుతున్నావని ప్రశ్నించిందట. దానికి అతను చెప్పిన సమాధానం `నేను నిన్ను ఫాలో అవుతున్నానని ఎవరు చెప్పారు?` అని.
ఆ మాటతో ఒక్కసారిగా సమంత మైండ్ బ్లాక్ అయ్యిందట. అతని గురించి మనసులో ఏదేదో ఊహించుకుందట. కానీ ఒక్కసారిగా నీరు గార్చాడట. ఇంతకి ఆ లవ్ ఏంటో అర్థం కాలేదట. అతను తనని ఇష్టపడ్డాడా? లేదా? ఇష్టపడి చెప్పలేకపోయాడా? అనేది అర్థం కాలేదు. అదొక విచిత్రమైన అనుభవం అని తెలిపింది సమంత. కానీ అదొక స్పెషల్ మెమొరీగా మిగిలిపోయిందని కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా షోలో వెల్లడించింది సామ్.