బుక్స్ చదివితే ఎన్నో విషయాలు తెలియడంతో పాటు.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది అంటారు పవన్. అందుకే ఎంత ఒత్తిడిలో ఉన్నా.. పుస్తకాలు చదవడం మాత్రం ఆపరట పవర్ స్టార్. అంతే కాదు చాలా ప్రశాంతంగా కనిపించే జనసేనాని.. అప్పుడప్పుడు రాత్రివేళలో హర్రర్ పిక్చర్స్ చూసే అలవాటు కూడా ఉందట పవన్ కళ్యాణ్ కు.
ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహరవీరమల్లు సినిమాతో పాటు.. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉంది. హరిహర వీరమల్లు సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈసినిమా నుంచి క్రిష్ తప్పకోవడంతో.. ఆయన ఆద్వర్యంలో మరో ద్శకుడు మిగిలిన సినిమాను కంప్లీట్ చేయబోతున్నారు.