క్రేజీ హీరో ఇంటి గోడపై సమంత మాట.. ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది ? రిప్లై ఇవ్వడంతో రూమర్స్ షురూ 

First Published | Nov 29, 2024, 12:51 PM IST

సమంత ప్రస్తుతం సిటడెల్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మునిగిపోయింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సమంత, వరుణ్ ధావన్ కలసి నటించిన సిటడెల్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

సమంత ప్రస్తుతం సిటడెల్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మునిగిపోయింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సమంత, వరుణ్ ధావన్ కలసి నటించిన సిటడెల్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. దీనితో టీమ్ కోసం సక్సెస్ పార్టీ చేసుకున్నారు. వరుణ్ ధావన్ సమంతని సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తాడు. 

తన నటించిన హీరోయిన్లలో సమంత బెస్ట్ కోస్టార్ అంటూ అభివర్ణించాడు. ఇదిలా ఉండగా సమంత పర్సనల్ లైఫ్ గురించి తరచుగా రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత మూడేళ్ళ వైవిహిక జీవితం తర్వాత విడాకులు తీసుకుని విడిపోయింది. చైతు రెండో వివాహం చేసుకోబోతున్నాడు. సమంత సింగిల్ గా ఉంటోంది. 


అయితే సమంత రిలేషన్ షిప్ పై కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సిటడెల్ డైరెక్టర్ రాజ్ తో సమంత క్లోజ్ గా ఉంటోంది అని ఆ మధ్యన పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా సమంత గురించి కొత్త రూమర్ పుట్టుకొచ్చింది. రీసెంట్ గా సమంత సోషల్ మీడియాలో ఒక మోటివేషనల్ కవిత్వాన్ని పోస్ట్ చేసింది. ఎందరు అనుమానించినా నిన్ను నీవు నమ్ము.. కలలు కనొచ్చు.. కానీ కలలు నిన్ను శాసించకూడదు. ఆలోచించు.. కానీ ఆలోచనలే నీ లక్ష్యం కాకూడదు అంటూ సమంత ఇంగ్లీష్ పద్యాన్ని పోస్ట్ చేసింది. 

ఈ పద్యం నాకు వెలుగునిచ్చే కాంతి కిరణం లాంటిది. మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది అంటూ సమంత పోస్ట్ చేసింది. ఫ్యాన్స్ లైకులు కొట్టారు. కానీ ఒక క్రేజీ హీరో మాత్రం ఆసక్తికరంగా సమంతకి రిప్లై ఇచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు అర్జున్ కపూర్. ఈ పద్యాన్ని నేను కూడా నా ఇంటి గోడపై ప్రింట్ చేసి పెట్టుకున్నా. నాకు ఇన్సిపిరేషన్ అవసరం అనిపించినప్పుడు దీనిని చూస్తా అని అర్జున్ కపూర్ పేర్కొన్నారు. 

మొన్నటి వరకు అర్జున్ కపూర్ తనకంటే వయసులో 12 ఏళ్ళు పెద్దదైన మలైకా అరోరాతో డేటింగ్ చేశాడు. కొన్నేళ్లు వీరిద్దతూ వెకేషన్స్ లో బాగా విహరించారు. అయితే రీసెంట్ గా అర్జున్ కపూర్.. మలైకాకి బ్రేకప్ చెప్పాడు. ప్రస్తుతం అర్జున్ కపూర్ సింగిల్ గానే ఉంటున్నాడు. సమంతకి రిప్లై ఇచ్చాడో లేదో.. వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు రూమర్స్ మొదలయ్యాయి. 

Latest Videos

click me!