తమిళ్ స్టార్ హీరో విజయ్ ‘The Goat’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే సినిమాతో నిన్న గురువారం( సెప్టెంబర్ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కింది.
స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, అజ్మీర్, జయరాం.. ఇలా పలువురు స్టార్స్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించడం, విజయ్ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడంతో ఇదే విజయ్ లాస్ట్ సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తెలుగులో ఆ ఇంపాక్ట్ ఏమీ లేదు.
25
The GOAT advance sale collection report out
తమిళంలో ఈ సినిమా అదిరిపోయే టాక్ ను సొంతం చేసుకోగా మిగిలిన చోట్ల యావరేజ్, జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా సినిమా అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది.
తెలుగు లో మరీ లియో రేంజ్ లో అయితే బుకింగ్స్ లేవు కానీ…ఉన్నంతలో విజయ్ వారసుడు మూవీ రేంజ్ లో బుకింగ్స్ అయ్యాయి. మార్నింగ్ షోకు యావరేజ్ అనుకున్న టాక్, ఈవినింగ్ కు నెగిటివ్ గా మారింది.
35
The GOAT total advance ticket sale report out
తెలుగు లో ఓపినింగ్స్ ప్రక్కన పెడితే అడ్వాన్స్ బుక్కింగ్ లు బాగా పూర్ గా ఉన్నాయి, మొదటి రోజు కలెక్షన్స్ దాదాపు 5 కోట్లు వరకూ వచ్చి ఉంటాయని అంచనా. తెలుగులో గోట్ థియేటర్ రైట్స్ 22 కోట్లు దాకా అమ్ముడయ్యాయి. అంటే రికవరీ అయ్యి, హిట్ అనిపించుకోవాలంటే గ్రాస్ 40 కోట్లు దాకా రావాలి.
45
The GOAT pre sale collection at overseas
ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్ ని బట్టి తెలుగులో బ్రేక్ ఈవెన్ రావటం కష్టమే అంటున్నారు. సినిమా ఆన్ లైన్ బుక్కింగ్స్, ఈవినింగ్,నైట్ షోలు నిన్న చాలా పూర్ గా ఉండటం డిస్ట్రిబ్యూటర్స్ ని భయపెట్టే అంశమే.
సాధారణంగా విజయ్ సినిమాలకు లియోకు తప్పించి మిగతావాటికి హిట్ టాక్ వచ్చాకే పికప్ అయ్యాయి. ఈ సారి హిట్ టాక్ స్ప్రెడ్ కాకపోవటం, ఓ ప్రక్కన వరదలు, భారీ వర్షాలు కూడా సినిమా కలెక్షన్స్ కు అడ్డంకిగా మారాయి.
55
The GOAT Vijay film first title revealed
తెలుగు వారు చెప్పే మైనస్ లు విషయానికి వస్తే..
సినిమా లెంగ్త్ 3 గంటలు కావడంతో చాలా చోట్ల సినిమా సాగదీసినట్టు అనిపిస్తూంటుంది. దానికి తోడు రెగ్యులర్ కథే కావడం, ట్విస్ట్ లు ముందే ఊహించడం మైనస్ గా మారింది.అలాగే తండ్రి కొడుకులు హీరో – విలన్ గా కొట్టుకోవడం చూసి బోలెడన్ని పాత సినిమాలు గుర్తుకు వస్తాయి.
కొన్ని సీన్స్ తప్పితే విజయ్ ని ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో డీ ఏజింగ్ చేసి నడిపేసారు. క్లైమాక్స్ ఓ పక్క క్రికెట్, ఓ పక్క యాక్షన్ సీన్స్ కంపారిజాన్ చేస్తూ చూపించిన విధానం మాత్రం బాగుంటుంది. సినిమాలో క్రికెట్ ఫ్యాన్స్ కి ముఖ్యంగా ధోని ఫ్యాన్స్ కి మాత్రం మంచి ఫీస్ట్ ఉంది