బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌కి ఎందుకొచ్చినట్టు? ఆదిత్య ఓం తోపాటు ఆ కంటెస్టెంట్లపై దారుణంగా ట్రోలింగ్‌

First Published | Sep 6, 2024, 7:52 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8 లో కొందరు కంటెస్టెంట్లపై ట్రోల్స్ నడుస్తున్నాయి. డల్ గా ఉన్నవారిని ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఎందుకొచ్చావ్‌ బ్రో హౌజ్‌కి అంటూ రచ్చ చేస్తున్నారు. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ఈ ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. 14 మంది కంటెస్టెంట్లతో సెప్టెంబర్‌ 1న ఈ షో స్టార్ట్ అయ్యింది. ఎప్పటిలాగే మరో ఆరు, ఏడు మంది కంటెస్టెంట్లని వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురాబోతున్నారని తెలుస్తుంది.

ఇక 14 మందితో స్టార్ట్ అయిన బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌.. ప్రారంభం నుంచే వాడివేడిగా సాగింది. కంటెస్టెంట్లు చీటికి మాటికి గొడవపడటం ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ డే నుంచే తమ స్ట్రాటజీ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. 

ప్రతి దానికి గొడవ పడితే, అరిస్తే కెమెరాల్లో పడతామని, ఎపిసోడ్‌లో హైలైట్ గా చూపిస్తారని వాళ్లు భావించి అలా బిహేవ్‌ చేస్తున్నారనిపిస్తుంది. చాలా మంది జెన్యూన్‌గా కనిపించడం లేదు. కెమెరాల ముందు యాక్టింగ్‌ చేస్తున్నట్టుగానే ఉందని నెటిజన్లు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

అదే సమయంలో ట్రోల్స్ కూడా చేస్తున్నారు. కొందరు కంటెస్టెంట్లని నెత్తిన పెట్టుకుని ప్రమోట్‌ చేస్తున్నారు, మరికొందరిని దారుణంగా విమర్శిస్తున్నారు. అసలే కాచుకుని కూర్చునే ట్రోలర్స్.. సందు దొరికితే రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కొందరు కంటెస్టెంట్లని బాగా ట్రోల్‌ చేస్తున్నారు. 
 

Latest Videos


ఇందులో మెయిన్‌గా ట్రోల్ కి గురవుతున్నవారిలో హీరో ఆదిత్య ఓం ఉన్నాడు. ఆయన ఓపెనింగ్ రోజు స్టేజ్‌పై చాలా యాక్టివ్‌గా కనిపించాడు. ప్రతి దానికి నవ్వుతూ, చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యాడు. కానీ హౌజ్‌లోకి వచ్చాక మాత్రం సైలెంట్‌ అయ్యాడు. ఎప్పుడూ డల్ గా కనిపిస్తున్నాడు. ఉంటే ఒంటరిగా, ఎప్పుడూ నిద్రపోయినట్టే కనిపిస్తున్నాడని,

వచ్చీ రానీ తెలుగుతో మాట్లాడలేక ఇబ్బంది పడుతూ, సగం సగం మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తున్నాడని, ఏమాత్రం యాక్టివ్‌గా కనిపించడం లేదనే కంప్లెయింట్‌ నెటిజన్లు నుంచి వినిపిస్తుంది. అందుకే బ్రో నువ్వసలు హౌజ్‌లో ఉన్నావా? బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లోకి ఎందుకొచ్చావు బ్రో అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 సీజన్‌ ప్రారంభమై ఐదు రోజులవుతుంది. ఇప్పటి వరకు ఆదిత్య ఓం బాగా హైలైట్‌ అయిన సందర్భం ఒక్కటి కూడా లేదని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఓ సారి టవల్‌ కోసం, మరోసారి మణికంఠ విషయంలో గుసగులు పెడుతూ, ఇంకోసారి తన కొడుకు గురించి చెబుతూ కెమెరాల్లో కనిపించాడు.

దీంతోపాటు నామినేషన్స్ లో ఎలాగూ కనిపించాలి కాబట్టి కనిపించాడు. అందుకే ఆయనపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఫాలోవర్స్ మాత్రం ఆదిత్యని బాగానే సపోర్ట్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆయనకు ఓ ఆర్మీనే పని చేస్తుంది. ఎవరు ఎంత అరిచినా ఆదిత్య కూల్‌గా డీల్‌ చేస్తాడని ఆయన ఫ్యాన్స్ కామెంట్‌ చేస్తుండటం విశేషం. తాను చాలా వరకు జెన్యూన్‌గా ఉంటున్నాడని అంటున్నారు. 
 

ఇదిలా ఉంటే హౌజ్‌లో మరికొందరిపై కూడా విమర్శలు వస్తున్నాయి. అందులో బేబక్క కూడా ఉంది. సోషల్‌ మీడియాలో ఆమె చేసే రచ్చ వేరే లెవల్‌లో ఉంటుంది. కానీ బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఆమె కామెడీ అయిపోతున్నట్టుగా కనిపిస్తుంది. పెద్దగా దేన్ని వ్యతిరేకించడం లేదు. వాదించడం లేదు. కుళ్లు జోకులు, సెటైర్లు పేలుస్తూ కనిపిస్తుంది.

ఆటల్లో ఆమె ఏమాత్రం యాక్టివ్ గా కనిపించడం లేదు. చాలా వరకు కిచెన్‌లోనే టైమ్ స్పెండ్‌ చేస్తుంది. ఆమెతోపాటు శేఖర్‌ బాషా కూడా డల్‌గానే ఉన్నాడు. ఆర్జేగా ఆయనకు ఎంతో పేరు ఉంది. కానీ బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఆయన ఏమాత్రం తన ప్రభావం చూపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 
 

అలాగే అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. కాకపోతే జెన్యూన్‌గా ఉన్నాడనే సింపతి వర్కౌట్‌ అవుతుంది. ఇక నాగమణికంఠ ఇంకా ఫ్యామిలీ సింపతీని కంటిన్యూచేస్తున్నాడు. నాకు ఈ బిగ్‌ బాస్‌ హౌజ్‌ చాలా ముఖ్యం అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఎక్కువగా ఎమోషనల్ అవుతూ చిరాకు తెప్పిస్తున్నాడు.

పృథ్వీరాజ్‌ కూడా డల్‌గానే కనిపిస్తున్నాడు. అభయ్‌ నవీన్‌ కూడా గేమ్‌లో తన సత్తా చాటలేకపోతున్నాడు. ఆయన కూడా ఇంకా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. ప్రధానంగా వీరి పేర్లు డల్‌ లిస్ట్ లో వినిపిస్తున్నాయి.

ఇక మొదటి వారం శేఖర్ బాషా, బేబక్క, సోనియా ఆకుల, ప్రేరణ, నాగ మణికంఠ, విష్ణుప్రియ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. అయితే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌ ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. గతసీజన్‌ లో ఎలిమినేట్‌ చేయలేదనే విషయం తెలిసిందే. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 పోల్ః ఈ వారం బిగ్ బాస్ హౌౌజ్ నుంచి ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

click me!