‘ఆదిపురుష్’ పాటల సంగతేంటి.. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి.. లేటెస్ట్ అప్డేట్.!

Published : Oct 10, 2022, 04:10 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషనల్ లో తెరకెక్కబోతున్న చిత్రం ‘ఆదిపురుష్’. వరుసగా అప్డేట్స్ వస్తున్న క్రమంలో మూవీలో సాంగ్స్ ఎన్ని ఉన్నాయి... ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది. 

PREV
16
‘ఆదిపురుష్’ పాటల సంగతేంటి.. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి.. లేటెస్ట్ అప్డేట్.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) రాముడిగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’(Adipurush). హిందూ మైథలాజికల్ మూవీగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాస్ అభిమానులు, మరియు ప్రేక్షకులు మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దసరా కానుకగా ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ కూడా విడుదలైన విషయం తెలిసిందే.
 

26

‘ఆదిపురుష్’టీజర్ విడుదలై వివాదాలకు గురైన విషయం తెలిసిందే. రాముడు, రావణుడు, హన్మంతుడి పాత్రలను తప్పుగా చూపించారని బ్రహ్మణ సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోవైపు తక్షణమే మార్పులు చేపట్టాలని యూపీలోని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఇదిగాక ట్రోల్స్ కూడా భారీగానే జరిగాయి.
 

36

భారీ అంచనాలు నెలకొల్పిన ‘ఆదిపురుష్’పై ఇప్పటికీ ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ పై అభిమానులు కూడా సంతోషంగా లేనట్టు తెలుస్తోంది. ఆవెంటనే వచ్చిన  ‘ఆదిపురుష్ త్రీడీ ట్రైలర్’ మాత్రం కాస్తా పర్లేదని అనిపించింది. దీంతో మళ్లీ అంచనాలు పెరుగుతున్నాయి. 
 

46

ఈక్రమంలో మూవీలోని సాంగ్స్ పై తాజాగా అప్డేట్ అందింది.  సినిమాలో ఎన్ని  పాటలు ఉండబోతున్నాయి.. అప్పటికే మైథలాజికల్ ఫిల్మ్ కావడంతో ఎలా ఉండనున్నాయనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.  దీనిపై తాజాగా అందిన సమాచారం ప్రకారం.. మూవీలో పాటలకు పెద్దగా ప్రాధాన్యత లేదంట. కథపైనే ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.

56

సినిమా మొత్తంగా కేవలం మూడు ఫుల్ లెన్త్ సాంగ్స్ మాత్రమే ఉంటాయని అంటున్నారు. టీజర్ లో వచ్చిన ‘జై శ్రీరామ్’ అనే సాంగ్ కు మంచి  రెస్పాన్సే ఉంది. ఈ పాటనే సినిమా మొత్తంగా కంటిన్యూ అవుతుంది.. బీజీఎంలోనూ ఇదే ఉంటుందంట. టీజర్ తో కాస్తా ఇబ్బంది పెట్టిన మేకర్స్.. పాటల విషయంలో ఎలా ఎంటర్ టైన్ చేస్తారోనని చర్చించుకుంటున్నారు.
 

66

ప్రస్తుతం ‘ఆదిపురుష్’ ప్రమోషన్స్ ను యూనిట్ ప్రారంభించింది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ సినిమాపై అంచనాలు పెంచేందుకు  ప్రయత్నిస్తున్నారు. మూవీలో రాముడి పాత్రలో ప్రభాస్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్,  సీతగా  క్రుతి సనన్ నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. భూషన్ కుమార్, కిషన్ కుమార్, రాజేష్ మోహనన్ నిర్మించారు. 2023 జనవరి 12న  వరల్డ్ వైడ్ విడుదల కానుంది. 

Read more Photos on
click me!

Recommended Stories