ఈ ప్రాజెక్ట్ గతంలోనే ఒకే అయ్యింది. కామెడీ ఫిల్మ్ గా రూపుదిద్దబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. వరుసగా యాక్షన్ ఫిల్మ్స్ లో నటిస్తున్న ప్రభాస్ కాస్తా ఈజీ సబ్జెక్ట్ తో ప్రేక్షకులను, అభిమానులను అలరించాలని భావించడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం ఆలస్యం అవుతూ వస్తోంది.