రజనీకాంత్‌ ‘వేట్టయన్‌’తమిళంలో రెస్పాన్స్ , ఇదేంటి ఇలా ఉంది?

First Published | Oct 10, 2024, 3:48 PM IST

 ‘జై భీమ్’ త‌ర‌హాలోనే మ‌రోసారి డైరక్టర్ న్యాయం, విద్య స‌మానంగా అందాలనే ఓ బ‌ల‌మైన అంశాల్ని ఎంచుకుని ఈ చిత్రాన్ని మ‌లిచారు. 

Vettaiyan The Hunter, Rajinikanth, Amitabh Bachchan


ద‌స‌రా కానుకగా వచ్చిన  ర‌జ‌నీకాంత్ తాజా చిత్రం ‘వేట్ట‌య‌న్‌’. విజ‌య‌వంత‌మైన ‘జైల‌ర్‌’ త‌ర్వాత ఆయ‌న్నుంచి వ‌చ్చిన పూర్తిస్థాయి సినిమా ఇదే. ‘జై భీమ్’ ఫేమ్ జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం... ర‌జ‌నీకి తోడుగా అమితాబ్ బ‌చ్చ‌న్‌, రానా ద‌గ్గుబాటి త‌దిత‌ర తారాగ‌ణం న‌టించ‌డంతో ‘వేట్ట‌య‌న్‌’పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి.

మంచి ఓపినింగ్స్ తో ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది ఈ చిత్రం. తెలుగులో ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? రజనీ మార్క్‌ యాక్షన్‌ ఎంత వరకూ వర్కవుట్‌ అయింది? తమిళం వాళ్లు ఈ సినిమాని ఏ స్దాయిలో ఆదరిస్తున్నారో చూద్దాం.


రజనీకాంత్ సినిమాలకు ఓ సెపరేట్  ఫార్ములా ఉంటుంది. అదిరిపోయే హీరోయిజం ఉంటుంది. అయితే సామాజిక సందేశం ప్రధానాంశంగా తీసిన జై భీమ్ దర్శకుడు జ్వానవేల్ డైరక్షన్ అనగానే అభిమానులు అనుమాన పడ్డారు. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. సినిమా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో రెడీ అయ్యిందని ట్రైలర్ తో అర్దమైపోంది.

ఈ క్రమంలో  రజనీకాంత్ అభిమానులంతా ఇప్పుడు 'వేట్టయన్' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేసారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించిన ఈ సినిమా తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
 



తెలుగులో  ‘వేట్టైయాన్ - ది హంట‌ర్‌’ పరిస్దితి ఏంటి

 గతంలో రజనీ చిత్రాలుకు ఉన్నంత ఊపు అయితే లేదు. దానికి తగినట్లుగా  టైటిల్ మార్చకుండా యధాతథంగా తమిళ టైటిల్  ఉంచేయడం పట్ల బాషా ప్రేమికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సినిమాగా  చూస్తే.. నేరస్తులు .. కోర్టులు .. పోలీసుల నేపథ్యంలో సాగే సన్నివేశాలను  ఎక్కువగా టచ్ చేశారు. రజనీ మార్క్ డైలాగ్స్ తో .. ఫైట్లతో అదిరిపోతుందేమో అనుకున్నవారికే నిరాశ ఎదురైంది.  ‘జై భీమ్’ త‌ర‌హాలోనే మ‌రోసారి డైరక్టర్ న్యాయం, విద్య స‌మానంగా అందాలనే ఓ బ‌ల‌మైన అంశాల్ని ఎంచుకుని ఈ చిత్రాన్ని మ‌లిచారు.

క‌థ చెప్పిన ఉద్దేశం, దాన్ని ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ఎన్‌కౌంట‌ర్స్‌తో ముడిపెట్టి చెప్పిన విధానం బాగుంది కానీ కొంతదూరం వెళ్లాక మరీ మెసేజ్ ఓరియెంటెడ్ గా మారిపోయింది.   ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌కి త‌గ్గ కమర్షియల్ ఎలమెంట్స్  కానీ,  ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లు  కానీ లేక‌పోవ‌డంతో సినిమా ఒక ద‌శ దాటిన త‌ర్వాత సోషల్ కామెడ్ తో  కూడిన ఓ డాక్యుమెంట‌రీలా అనిపిస్తుంది.  దాంతో తెలుగులో ఈ సినిమా జస్ట్ ఓకే సినిమా అనిపించుకుంది. ఫస్టాఫ్ అదిరిపోయింది కానీ సెకండాఫ్ సోసో గా ఉందని తేల్చేసారు. 
 

‘వేట్టైయాన్ - ది హంట‌ర్‌’ తమిళంలో  పరిస్దితి ఏంటి

ఇక తమిళంలో రజనీకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దాంతో ఈ సినిమాకు ఓపినింగ్స్ అయితే అదిరిపోయాయి. అయితే అక్కడా రివ్యూలు పూర్తి పాజిటివ్ గా రాకపోవటం చెప్పుకోదగ్గ అంశం. అక్కడ వాళ్లు రజనీ కన్నా ఎక్కువగా  ఫహాద్ ఫాజిల్ నటనని మెచ్చుకుంటున్నారు. అతని ఫెరఫార్మెన్స్ అదిరిపోయిందని అంటున్నారు.

అనిరిథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అప్ టు ది మార్క్ లేదని తేలుస్తున్నారు.  ఫస్టాఫ్  స్థాయిలో ద్వితీయార్ధంలో డ్రామా పండ‌లేదు.  క్లైమాక్స్ సీన్స్ సాదాసీదాగానే అనిపిస్తాయి.  ఓ స‌మ‌స్య‌ని చ‌ర్చించినా,  డ్రామాలోనూ, పాత్ర‌ల్లోనూ స‌హ‌జ‌త్వం లేక‌పోవ‌డం సినిమాని ఇబ్బంది పెట్టిన‌ట్టైందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
 

Actor Rajinikanths Vettaiyan film first responses review


రజనీనే స్పెషల్

ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా ర‌జ‌నీకాంత్ త‌న వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లో క‌నిపించంట ఈ సినిమాలో పెద్ద పాజిటివ్ ఎలిమెంట్. రజనీ సూపర్ హిట్  ‘జైల‌ర్‌’ సినిమాని గుర్తు చేస్తుంది ఆయ‌న న‌ట‌న‌, పాత్ర‌. అయితే ఫ్యాన్స్ థియేటర్లో గోల చేయటానికి సరపడ మెటీరియల్ అయితే లేదు.

 సూప‌ర్‌స్టార్ నుంచి ఆశించే హీరోయిజం, ఆయ‌న ఇమేజ్‌కి త‌గ్గ అంశాలు ఇందులో కొర‌వ‌డటం నిరాశ‌ప‌రుస్తుంది. ‘గురిపెడితే ఎర ప‌డాల్సిందే’ అంటూ రజనీ  చేసిన హంగామా జస్ట్ ఓకే అనిపిస్తుంది. యాక్టింగ్ ప‌రంగానూ, ఆయ‌న లుక్ ప‌రంగానూ ర‌జ‌నీకాంత్  ఇందులో కొత్త‌గా క‌నిపించిందేమీ లేదు. అమితాబ్ బచ్చ‌న్ పాత్ర‌కీ పెద్ద‌గా ప్రయారిటీ లేదు లేదు. ర‌జ‌నీకాంత్‌, అమితాబ్ పాత్ర‌ల మ‌ధ్య కాంఫ్లిక్ట్, లోనూ బ‌లం లేదు.
  

Latest Videos

click me!