ప్రైవేట్ పార్టీలలో కూడా ఆయన పెద్దగా కనిపించరు. ఇంట్లో ఉంటే మహేష్ బాబు చిన్న పిల్లాడు అయిపోతాడు. గౌతమ్, సితారలతో సరదాగా ఆడుకుంటాడు. కొత్త సినిమాలు, సిరీస్లు చూడటం, నచ్చిన పుస్తకాలు చదవడం ఆయనకు ఇష్టమైన వ్యాపకం. అలాగే సోషల్ మీడియాను ఫాలో అవుతారు.
వీటన్నింటికీ మించి అందగాడు. స్టార్డం కలిగిన హీరో. అల్లుడిగా చేసుకోవడానికి ఇంతకు మించిన క్వాలిటీస్ ఏం కావాలి చెప్పండి. అందుకే హీరో బాలకృష్ణ సూపర్ స్టార్ కృష్ణతో వియ్యమందుకుందామని అనుకున్నారట. అనుకున్నట్లు జరిగితే.. మహేష్ బాబు బ్రాహ్మణిని వివాహం చేసుకోవాల్సిందట. వరుస హిట్స్ తో స్టార్ గా ఎదుగుతున్న మహేష్ బాబును బాలకృష్ణ అల్లుడు చేసుకోవాలనుకున్నారట. ఇదే విషయం మహేష్ తో బాలకృష్ణ మాట్లాడారట. మా పెద్దమ్మాయి బ్రాహ్మణిని వివాహం చేసుకుంటావా? అని అడిగాడట. మహేష్ సున్నితంగా బాలకృష్ణ ప్రపోజల్ ని తిరస్కరించాడట.