సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మిస్సమ్మ. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్ లు హీరోలుగా నిలదొక్కుకున్నారు. అయినప్పటికీ ఈ చిత్రంలో ఎలాంటి కమర్షియల్ హంగులు ఉండవు. చక్కని హాస్యం, భావోద్వేగాలు, గిల్లిగజ్జాలతో సాగుతుంది. సాలూరి రాజేశ్వరరావు అందించిన మ్యూజిక్ అద్భుతం అని చెప్పాలి.
మిస్సమ్మలో ఎస్వీ రంగారావు, సావిత్రి నటన.. ఎన్టీఆర్, ఏఎన్నార్ లను కూడా డామినేట్ చేసేలా ఉంటుంది. సావిత్రి హీరోయిన్ గా ఎదుగుతున్న రోజుల్లో వచ్చిన మిస్సమ్మ ఆమె కెరీర్ కి చాలా ప్లస్ అయ్యింది. సావిత్రి ఇమేజ్ మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే మిస్సమ్మ లో మొదట తీసుకున్న ప్రధాన హీరోయిన్ సావిత్రి కాదు. నిర్మాతకు ఆ మూవీ హీరోయిన్ కి మధ్య తలెత్తిన వివాదం.. సావిత్రికి మేలు చేసింది.