లాక్ డౌన్ సమయంలో ప్రజలు గడపదాటే పరిస్థితి లేకపోవటంతో వారికి ఉన్న ఏకైక వినోద సాధనంగా నిలిచింది టీవీ. సీరియల్స్ షూటింగ్స్ ఆగిపోయినా రిపీట్ ప్రొగ్రామ్స్‌ను కూడా ఆడియన్స్ తెగ ఆదరించారు. దీంతో టీఆర్పీలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో టీవీ ఛాన్సల్ అన్ని పండగ చేసుకున్నాయి. ఇప్పటికీ థియేటర్లు, పార్కులు లాంటివి తెరుచుకోకపోవటంతో ప్రజలు వినోదం కోసం టీవీనే ఆశ్రయిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభం కావటంతో టీఆర్పీలు చుక్కలు తాకటం ఖాయం అని భావించారు అంతా. షో నిర్వాహకులు కూడా ఎంటర్‌టైన్మెంట్ నెవ్వర్ బిఫోర్ అంటూ ఊరించటంతో ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోతారన్న అంచనాకు వచ్చేశారు.
అయితే తాజాగా వచ్చిన గణాంకాలు ఒక్కసారిగా బిగ్ బాస్ టీంకు షాక్ ఇచ్చాయి. 34 వారానికి సంబంధించిన రేటింగ్స్ టీవీ రంగంలో కలవరం పుట్టిస్తోంది. అంతకు ముందు వారం 540 పాయింట్లుగా ఉన్న రేటింగ్ ఈ వారం 413కు పడిపోయింది. న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ అన్న తేడా లేకుండా అన్ని ఛానల్స్‌లో ఈ డ్రాప్ కనిపించింది. దీంతో టెలివిజన్ వర్గాలు, ముఖ్యంగా బిగ్ బాస్ నిర్వహకులు ఆలోచనలో పడ్డారు.
ఈ సడన్ డ్రాప్‌కు కారణాలేంటని విశ్లేషించే పనిలో ఉన్నారు. అయితే గత వారం భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల, విద్యుత్ సమస్యలు రావటం, వర్షాల సమయంలో డీటీహెచ్‌లు కూడా సరిగ్గా పనిచేయకపోవటంతోనే టీఆర్పీలు దారుణంగా పడిపోయి ఉంటాయిన భావిస్తున్నారు.
అయితే ఇంత కష్టకాలంలోనూ కార్తీక దీపం మాత్రం సత్తా చాటింది. వంటలక్క మీద ఉన్న అభిమానంతో ఆడియన్స్ ఆ సీరియల్‌ను మాత్రం మిస్ కాలేదు. ఎప్పటి లాగే 18 పాయింట్లకు పైగా వ్యూయర్ షిప్ సాధిస్తూ నెంబర్ వన్ సీరియల్‌గా తన స్థానాన్ని కొనసాగించింది కార్తిక దీపం. అంతే కాదు టాప్ 10 షోస్‌లో తొలి ఆరు స్థానాల్లోనూ కార్తీక దీపమే ఉందంటేనే ఆ సీరియల్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
అయితే ప్రస్తుతం వాతావరణం కాస్త అనుకూలంగా ఉండటం, బిగ్ బాస్ షో మొదలు కావటం. ఐపీఎల్ హడావిడి కూడా కనిపిస్తుండటంతో టీవీ టీఆర్పీలు తిరిగి పుంజుకుంటాయని భావిస్తున్నారు టెలివిజన్ వర్గాలు. మరి వారి అంచనాలు ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి.