టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో అక్కినేని అమల-నాగార్జున ఒకరు. వీరిది ప్రేమ వివాహం. మొదటి భార్యతో విడిపోయిన నాగార్జున 1992లో అమలను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి అఖిల్ అక్కినేని సంతానం. నాగ చైతన్య మొదటి భార్య సంతానం.
26
నాగార్జున అమల చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒకరికి మరొకరు అన్నట్లు జీవిస్తారు. మూడు దశాబ్దాల కాపురంలో పెద్దగా గొడవపడిన సందర్భాలు లేవు. అమల పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపాదడపా సినిమాలు చేస్తుంది.
36
అమల సామాజిక స్పృహ ఉన్న మహిళ. అనేక సేవా కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. అలాగే ఆమె యానిమల్ లవర్. బ్లూ క్రాస్ సొసైటీ హైదరాబాద్ కో ఫౌండర్. మూగజీవాల రక్షణకు కృషి చేస్తున్నారు.
46
కాగా నాగార్జునతో ఒక విషయంలో అమలకు గొడవలు జరుగుతాయట. ఈ విషయాన్ని అమల నేరుగా వెల్లడించింది. ఏదైనా ఒక పని మొదలు పెట్టకముందే నేను చేయలేనని, అమల బాధపడతారట. లేదు నీ వల్ల అవుతుంది. చేయగలవు అని నాగార్జున అంటారట.
56
అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందట. అయితే ఎలాంటి గొడవైనా సాయంత్రానికి సెటిల్ చేసుకుంటారట. నాగార్జున తనను ఎంతో ప్రేమగా చూసుకుంటాడట. ఏది అడిగినా కాదని అనడట. అమల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
66
1993లో విడుదలైన ఆగ్రహం హీరోయిన్ గా అమలకు చివరి చిత్రం. అనంతరం 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. మనం, ఒకే ఒక జీవితం, తుమ్ సే నా హో పాయెగా... చిత్రాల్లో అమల నటించింది. నాగార్జున నా సామిరంగ చిత్రంతో హిట్ కొట్టాడు.