మాజీ జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో వ్యాపారం మొదలుపెట్టాడు. అయితే ఈ కర్రీ పాయింట్ లో చేపల పులుసు ధరలు ఎక్కువగా ఉంటున్నాయన్న ఆరోపణలపై అతడు స్పందించాడు.
కిరాక్ ఆర్పీ జబర్దస్త్ మానేశాక డైరెక్టర్ అవతారం ఎత్తాడు. ఓ మూవీ స్టార్ట్ చేశాడు. అది మధ్యలో ఆగిపోయింది. కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కూకట్ పల్లి సమీపంలో ఒక కర్రీ పాయింట్ పెట్టాడు.
25
Kiraak RP
నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం బాగా సక్సెస్ అయ్యింది. దాంతో హైదరాబాద్ లో మరో బ్రాంచ్ ఏర్పాటు చేశాడు. ఇటీవల తిరుపతిలో కూడా స్టార్ట్ చేశాడు. కిరాక్ ఆర్పీ వద్ద చాలా మంది ఫ్రాంచైజీలు తీసుకుని వ్యాపారం చేస్తున్నారు.
35
Kiraak RP
అయితే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ లో ధరలు ఎక్కువగా ఉంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో కిరాక్ ఆర్పీ స్పందించాడు. అందుకు కారణాలు చెప్పుకొచ్చాడు. చేపల పులుసు ధరలు అధికంగా ఉన్న మాట వాస్తమే అని కిరాక్ ఆర్పీ ఒప్పుకున్నాడు.
45
Kirak RP
నేను ఖరీదైన చేపలను తెస్తాను. నేను, దినుసులు, మసాలాలు క్వాలిటీ ఉన్నవి వాడతాను. అందుకే ఎక్కువ ధరలు ఉంటున్నాయి. జేబులో వంద రూపాయలు వేసుకొచ్చి చేపల పులుసు కావాలంటే కుదరదు. నా ధరలు ఇంతే, ఇష్టం ఉంటే కొనండి లేదంటే మానేయండి.
55
కొందరు యూట్యూబ్ లో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ధరలు ఎక్కువ, రుచి బాగోలేదంటూ వీడియోలు పెడుతున్నారు. చేపను బట్టి ధర ఉంటుందని కిరాక్ ఆర్పీ చెప్పుకొచ్చాడు. రానున్న కాలంలో చాలా ఏరియాల్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్స్ ఏర్పాటు చేయనున్నట్లు కిరాక్ ఆర్పీ చెప్పాడు...