Guppedantha Manasu
Guppedantha Manasu 4th march Episode:వసుధార కారు మధ్యలో బ్రేక్ డౌన్ ఇస్తుంది. అటుగా వెళ్తున్న మను.. కారు రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ.. తన వల్ల కాదు. దీంతో.. వసుధార.. తాను ఆన్ లైన్ లో మెకానిక్ కోసం వెతుకుతానని చెబుతుంది. దాని కోసం మీరు ఎందుకు వెయిట్ చేయడం అని.. తాను డ్రాప్ చేస్తానని మను అంటాడు. వసుధార వద్దు అన్నా కూడా మను వినడు. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళతాను అని చెబుతాడు. అయితే వసధార.. తాను ఇంటికి వెళ్లడం లేదని చెబుతుంది. ఎక్కడికి అంటే.. మీరు అలాంటి ప్లేసులకు వెళ్లి ఉండరు. చూసి ఉండరు అని చెబుతుంది. ఎక్కడికైనా వస్తాను అని మను అంటాడు. మీరు నరకానికి తీసుకువెళ్లినా వస్తాను అంటాడు. దీంతో.. వసు కూడా వచ్చి కారు ఎక్కుతుంది.
Guppedantha Manasu
మరోవైపు శైలేంద్ర, రాజీవ్ లు మాట్లాడుకుంటూ ఉంటారు. వసుధారను రాజీవ్ కి ఎలా దగ్గర చేయాలని శైలేంద్ర... మనుని తప్పించి శైలేంద్రను ఎండీ చేయాలని రాజీవ్.. ఐడియాల కోసం చూస్తూ ఉంటారు. ఇద్దరికీ ఎలాంటి ఐడియాలు రావు. దీంతో.. ఏం చేయాలా అని బుర్ర గీక్కుంటూ ఉంటారు. ఆలోగా... అటు నుంచి మను కారు వెళ్తుంది. అందులో వసుధార కూర్చొని ఉంటుంది. ఆ దృశ్యం శైలేంద్ర కంట పడుతుంది. వెంటనే రాజీవ్ కి చూపిస్తాడు. అది చూసి రాజీవ్ కి విపరీతమైన కోపం వస్తుంది. నా డార్లింగ్ మరదలిని అతను ఎలా కారు ఎక్కించుకొని వెళతాడని.. వాడిని చంపేస్తాను అని ఆవేశపడతాడు. అయితే..శైలేంద్ర కూల్ చేస్తాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా తనకు మంచి ఐడియా వచ్చిందంటాడు. అదేంటో చెప్పమని రాజీవ్ అంటే... రేపటి వరకు వెయిట్ చేయమని అంటాడు.
Guppedantha Manasu
ఇక.. కారులో వెళ్తూ.. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పమని మను అడుగుతాడు. అయితే.., చాలాసేపు వసు చెప్పదు. మను మళ్లీ మళ్లీ అడగడంతో.. రిషి సర్ దగ్గరికి అంటుంది. షాకౌతాడు. రిషి సర్ జ్నాపకాలు ఉన్న చోటుకి, మేం ఎక్కువ సమయం కలిసి కడిపిన ప్రదేశానికి వెళ్తున్నాం అని చెబుతుంది. అలాంటి ప్లేస్ కి మీరు ఎప్పుడూ వెళ్లి ఉండరు అని అంటుంది. పిక్నిక్ స్పాట్ కా అని మను అడుగుతాడు. మీరు చాలా పిక్నిక్ స్పాట్స్ కి వెళ్లే ఉంటారు కదా అని వసు అనడంతో.. మరి ఎక్కడికి అని అడుగుతాడు. స్లమ్ ఏరియాకు అని చెబుతుంది. మిషన్ ఎడ్యుకేషన్ లో భాగంగా తాము ఈ స్లమ్ ఏరియాలకు వచ్చేవాళ్లం అని చెబుతుంది. మను సంతోషంగా ఆ ప్లేస్ కి తీసుకొని వెళతాడు.
Guppedantha Manasu
ఇక వసుధార ఆ ప్లేసులను చూస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఏమైందని మను అడిగితే... ఈ రోడ్లపైనే రిషి సర్ తో బైక్ మీద వెళ్లాం అని, పొలాల గట్ల మీద నడిచిన సీన్లు అని తలుచుకుంటూ ఉంటుంది. పొలం గట్ల మీద నడవాలి అనే సరికి మను భయపడతాడు. వీటి మీద నడవాలా అంటాడు. వసు.. అందుకే వద్దు అన్నాను అని, ఇప్పటికైనా వెనక్కి వెళ్లిపొమ్మని చెబుతుంది. కానీ.. మను లేదు.. వస్తాను అంటాడు. ఇక ఇద్దరూ కలిసి స్లమ్ ఏరియాకు వెళతారు. అక్కడ కూడా వసుకి.. రిషి తో కలిసి ఉన్న సందర్భాలే గుర్తుకువస్తాయి. వాటిని మనుతో పంచుకుంటుంది.
Guppedantha Manasu
చాలా మంది పిల్లలు స్కూల్ కి వెళ్లకుండా.. ఆడుకుంటూ ఉంటారు. వాళ్లను వసుధార పిలుస్తుంది. స్కూల్ కి ఎందుకు వెళ్లలేదు అని వసు అడిగితే.. స్కూల్ తమకు చాలా దూరం అని చెబుతారు. మీకు చదువుకోవాలని లేదా అని వసు అడిగితే.. ఉందని.. మీరు చదవిస్తారా అని ఆ పిల్లలు అడుగుతారు. చదవిస్తాం అని వసు వాళ్లకు చెప్పి.. వాళ్ల పేరెంట్స్ ని పిలవమని అడుగుతుంది.
Guppedantha Manasu
వాళ్లు వచ్చిన తర్వాత... పేరెంట్స్ తో వసుధార మాట్లాడుతుంది. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి వివరిస్తుంది. పిల్లలకు స్కూల్ బస్సు ఏర్పాటు చేస్తామని లేదంటే... ఇక్కడే స్కూల్ ఏర్పాటు చేస్తాం అని వసుధార చెబుతుంది. ఇక.. మను కూడా పిల్లలకు చదువు ప్రాముఖ్యతను వివరిస్తాడు. వాళ్లంతా పిల్లలను స్కూల్స్ కి పంపడానికి సరే అంటారు. త్వరలోనే మా టీమ్ ఇక్కడికి వస్తుంది అని చెప్పి.. మను, వసు వెళతారు.
Guppedantha Manasu
వసుధారను ఇంటి దగ్గర మను డ్రాప్ చేస్తాడు. తర్వాత.. వెళ్లిపోతాను అంంటే.. వసు ఇంటికి పిలుస్తుంది. మహేంద్ర రాగానే... ఎక్కడికి వెళ్లారు అంటే.. మిషన్ ఎడ్యుకేషన్ పని మీద వెళ్లాం అని చెబుతుంది. జరిగిన మొత్తాన్ని వివరిస్తుంది. మనుగారు తనకు సపోర్ట్ చేస్తున్నారని, నడి సముద్రంలో ఇరుక్కున్న తనకు ఊత కర్ర దొరికినట్లు అయ్యిందని చెబుతుంది. మను మోటివేషన్ తో చాలా మంది పిల్లలు చదువుకోవడానికి ముందుకు వచ్చారని వసు చెబుతుంది. మహేంద్ర.. మను ని మెచ్చుకుంటాడు. అయితే.. ఆ గొప్పతనం తనది కాదని, మిషన్ ఎడ్యుకేషన్ ది అని చెబుతాడు.
ఇక అనుపమ భోజనం చేయమంటే... మను వద్దు అంటాడు. మహేంద్ర మరోసారి.. భోజనం చెయ్యమని ఫోర్స్ చేస్తాడు. అయినా సరే మను వద్దు అని, మంచినీరు చాలు అంటాడు. అనుపమ తెచ్చి ఇస్తుంది. మను తాగుతాడు. అప్పుుడు అనుపమ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. తర్వాత మను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.