ప్రియుడితో పెళ్ళికి నయనతార రెడీ.. నిశ్చితార్థం అయింది

First Published Mar 25, 2021, 11:19 AM IST

కోలీవుడ్ ప్రేమ జంట విగ్నేష్ శివన్, నయనతార నిశ్చితార్ధం చేసుకున్నారన్న వార్త పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. ఈ లవ్ బర్డ్స్ నిశ్చితార్ధ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దర్శకుడు విగ్నేష్ శివన్ తాజా సోషల్ మీడియా పోస్ట్ దీనికి ఊతం ఇస్తుంది. 

విగ్నేష్ శివన్, నయనతార దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 2015లో విడుదలైన నానుమ్ రౌడీదాన్ చిత్ర సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటి నుండి పబ్లిక్ గానే వీరిద్దరూ తిరుగుతున్నారు.
undefined
ఒకరి పుట్టినరోజు ఒకరు చాలా ప్రత్యేకంగా జరుపుకొనే ఈ జంట, తరచుగా విహార యాత్రలకు వెళుతూ ఉంటారు. ఇక పండగలు కూడా కలిసి జరుపుకుంటారు.  ఇక పెళ్లి గురించి అడిగితే మాత్రం అప్పుడే కాదని సమాధానం చెవుతూ ఉంటారు.
undefined
ఆ మధ్య విగ్నేష్ శివన్ ని ఇదే విషయం అడుగగా, డేటింగ్ బోర్ కొట్టాక పెళ్లి చేసుకుంటాం అని ఓపెన్ గా చెప్పాడు.  అయితే ఎట్టకేలకు నయనతార, విగ్నేష్ పెళ్ళికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి.
undefined
విగ్నేష్ శివన్ తన ఇంస్టాగ్రామ్ లో ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఆ ఫోటో అర్థం, త్వరలో పెళ్లి అంటూ అందరూ అంచనా వేస్తున్నారు.  అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. విగ్నేష్, నయనతార నిశితార్థం జరుపుకున్నారని మాత్రం జోరుగా ప్రచారం సాగుతుంది.
undefined
ఇక కెరీర్ బిగినింగ్ లో హీరో శింబుతో ఘాడమైన ప్రేమను అనుభవించారు నయనతార. వీరిద్దరి ప్రైవేట్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. తరువాత వీరు బ్రేకప్ అయ్యారు.
undefined
శింబుతో బ్రేకప్ తరువాత ప్రభుదేవాతో ఆమె ప్రేమాయణం నడిపారు. నయనతార కోసం ప్రభుదేవా భార్యకు విడాకులు కూడా ఇచ్చారు. ప్రభుదేవాతో కూడా విడిపోయిన నయనతార, విగ్నేష్ తో ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నారు.
undefined
click me!