చరణ్ తో పాటు మెహబూబ్ అలా చనిపోతాడు... ఆచార్య లో అతని రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!

First Published Mar 25, 2021, 10:21 AM IST


బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా ఎక్కువ ప్రయోజనం, ఫేమ్ ఆర్జించిన వారిలో దిల్ సే మెహబూబ్ ఒకరు. ఫైనల్ కి కూడా చేరకుండానే చిరంజీవి ద్వారా పది లక్షల క్యాష్ అందుకున్న మెహబూబ్, ఏకంగా చిరంజీవి సినిమాలో ఓ కీలక రోల్ పట్టేశాడు. 
 

యూట్యూబ్ స్టార్ హోదాలో బిగ్ బాస్ షో కంటెస్టెంట్ గా ఎంపికయ్యాడు మెహబూబ్. షోలో కండల వీరుడిగా, టాస్క్ లలో దుమ్మురేపుతూ ఫ్యాన్స్ ని సంపాదించాడు.
undefined
మెహబూబ్ ఫైనల్ కి చేరడం ఖాయం అని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా అతడు మధ్యలోనే ఎలిమినేటై వెళ్లిపోవడం జరిగింది. అయితే ఫైనల్ నాడు మెహబూబ్ కి ప్రత్యేకంగా చిరంజీవి పదిలక్షలు ఇచ్చాడు.
undefined
ఇక బిగ్ బాస్ తరువాత మెహబూబ్ యూట్యూబ్ ఛానల్ కూడా దుమ్ము రేపుతోంది. అతడి వీడియోస్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి.
undefined
కాగా మెహబూబ్ కి చిరంజీవి తన లేటెస్ట్ మూవీ ఆచార్యలో ఓ రోల్ ఇప్పించారట. కథలో కీలకమైన మెహబూబ్ రోల్ చిత్రంలో 20 నిమిషాల వరకూ ఉటుందట.
undefined
జానపద గాయకుడిగా, ప్రజల్లో చైతన్యం కోసం పనిచేసే వాడిగా మెహబూబ్ పాత్ర ఉంటుందని సమాచారం. చరణ్ పాత్రలో పాటు మెహబూబ్ రోల్ సాగుతుందట.
undefined
చివరికి పోలీసుల కాల్పుల్లో చరణ్ తో పాటు, మెహబూబ్ పాత్ర కూడా చనిపోతుంది ప్రచారం సాగుతుంది. మరి ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఆసక్తి రేపుతోంది.
undefined
click me!