సంచలనంగా కృష్ణ వీలునామా... కొడుకులను కాదని కోట్ల ఆస్తి వాళ్లకు రాసేశాడా?

Published : Nov 16, 2022, 01:08 PM IST

నేటి జనరేషన్ కి సూపర్ స్టార్ కృష్ణ గురించి పెద్దగా తెలియదు. ఆయన మరణం నేపథ్యంలో కృష్ణ ఔన్నత్యం తెలియజేసే అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన సినిమా ప్రస్థానం విలువలతో సాగినట్లు తెలుస్తోంది.   

PREV
16
సంచలనంగా కృష్ణ వీలునామా... కొడుకులను కాదని కోట్ల ఆస్తి వాళ్లకు రాసేశాడా?
Super Star Krishna


కృష్ణ డబ్బుకు ఏనాడూ విలువ ఇవ్వలేదు. వరుస హిట్స్ పడినా అమాంతం రెమ్యూనరేషన్ పెంచేవారు కాదు. కృష్ణ తన ఫస్ట్ మూవీ తేనె మనసులు కు రూ. 2000 రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఆరు దశాబ్దాల క్రితం అది పెద్ద మొత్తమే అని చెప్పాలి. గూఢచారి 116, సాక్షి వంటి హిట్ చిత్రాలతో కృష్ణ త్వరగానే ఫేమ్ తెచ్చుకున్నారు. అయినా 40 చిత్రాలు చేసే వరకు కృష్ణ రెమ్యూనరేషన్ రూ. 5000 అంట. 
 

26


నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్న కృష్ణ తన మూవీ ఫెయిల్యూర్ తో నష్టపోయిన నిర్మాతలకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా మరో చిత్రం చేసి పెట్టేవారట. ఆ విధంగా నిర్మాతలను ఆదుకునేవాడట. ఇక పరిశ్రమలో ఎవరు ఆపదలో ఉన్న కృష్ణ చేయూత అందించేవారట. స్నేహితులను నమ్మి కృష్ణ కోట్లలో నష్టపోయారని సమాచారం. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వని వారు ఎందరో ఉన్నారట. 
 

36

నిర్మాతగా మారి ఆయన అనేక ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. వాటిలో కొన్ని విజయం సాధిస్తే మరికొన్ని తీవ్ర నష్టాలు మిగిల్చాయి. కొత్త జోనర్స్, రిస్క్ తో కూడిన సినిమాలు ఆయనే నిర్మించేవారు. ఈ కారణాలతో కృష్ణ సంపాదించిన మొత్తంలో చాలా వరకు కోల్పోయారు. 
 

46

అయినప్పటికీ కృష్ణ పేరిట చాలా ఆస్తి ఉందట. పద్మాలయ స్టూడియోతో పాటు ఆయన స్థిర, చర ఆస్తుల విలువ నాలుగు వందల కోట్లకు పైమాటేనట. ఈ మొత్తాన్ని కృష్ణ కొడుకులకు రాయకుండా మనవళ్లు, మనవరాళ్లకు రాశారట. కృష్ణ వీలునామాలో ఆస్తి మొత్తం కొడుకులకు పుట్టిన పిల్లలకు రాసేశారనేది టాలీవుడ్ టాక్. కూతుళ్ళకు కట్న కానుకల రూపంలో ముందుగానే ఇచ్చారట.

56

విజయ నిర్మల కొడుకైన నరేష్ కి ఆయన ఏమీ ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే నరేష్ కి తల్లి విజయనిర్మల ద్వారా పెద్ద మొత్తంలో ఆస్తి దక్కిందట. అందుకే ఆయన స్టెప్ ఫాదర్ కృష్ణ నుండి ఏమీ ఆశించలేదట. మహేష్, రమేష్ పిల్లలకు చెందేలా కృష్ణ వీలునామా రాశారని ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది.

66

కాగా కృష్ణ నవంబర్ 15 ఉదయం కన్నుమూశారు. అభిమానుల సందర్శనార్థం నేడు పద్మాలయ స్టూడియోలో పార్థివ దేహం ఉంచారు. నేడు సాయంత్రం మహాప్రస్థానంలో తెలంగాణా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. 

click me!

Recommended Stories