తెలుగులో స్టార్ హోదాని పొందింది రకుల్. దాదాపు అందరు యంగ్ హీరోలతో నటించింది. నాగార్జున వంటి సీనియర్ హీరోకి జోడీగానూ మెప్పించింది. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ సీనియర్ హీరోల సరసనే ఎక్కువగా కనిపిస్తుంది. అజయ్ దేవగన్, జాన్ అబ్రహం వంటి వారితో కలిసి సినిమాలు చేస్తుండటం గమనార్హం. ఈ ఏడాది `ఎటాక్`, `రన్‌వే34`, `కట్‌పుట్లీ`, `డాక్టర్ జీ`, `థ్యాంక్ గాడ్` చిత్రాలతో అలరించిన రకుల్ ఇప్పుడు `ఛత్రివాలి`, `మేరి పత్ని కా రీమేక్`, `అయలాన్`, `ఇండియన్ 2` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.