మెహబూబ్ కోసం కిర్రాక్ సీతకి అన్యాయం చేశారా..?

First Published | Oct 13, 2024, 11:37 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి కిర్రాక్ సీత ఎలిమినేట్ అయ్యి  బయటకు వెళ్ళిపోయింది. అయితే సీత వెళ్ళిపోవడంతో ఆడియన్స్ కు కొన్ని అనుమానాలు వస్తున్నాయి. 
 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రతీ వారం కొత్త కొత్తగా కనిపిస్తుంది. ఇక ఈవారం అంతా రాయల్ క్లాన్ సభ్యుల రాకతో.. సరికొత్తగా తయారయ్యింది బిగ్ బాస్ హౌస్. ఇక ఈ వీకెండ్ దసరా రావడంతో.. స్పెషల్ దసరా ఈవెంట్ తో బిగ్ బాస్ హౌస్ కళకళలాడిపోయింది. ఇక బిగ్ బాస్ నుంచి ఆరోవారం కిర్రాక్ సీత ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. 

మహేష్ బాబుతో సినిమా చేసి.. అడ్రెస్ లేకుండా పోయిన్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
 

నామినేషన్స్ లో  సీతతో పాటు.. విష్ణు ప్రియ, పృధ్వీ, యష్మి, గంగవ్వ, మెహబూబ్ ఉండగా.. చివరి వరకూ అందరూ సేఫ్ అవుతూ.. లాస్ట్ రౌండ్ లో మెహబూబ్, సీత మిగిలిపోయారు. అయితే చాలామంది మెహబూబ్ వెళ్ళిపోతాడేమో అనకున్నారు. కాని అనూహ్యంగా కిర్రాక్ సీత హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెల్ళిపోయింది. 

అయితే వెళ్తూ..వెళ్తు.. మూడు వైట్ హార్ట్స్.. మూడు బ్లాక్ హార్ట్స్ ను హౌస్ లో ఉన్నవారికి ఇచ్చింది. అందులో విష్ణు ప్రియ, నబిల్ తో పాటు.. ముక్కు అవినాశ్ కు వైట్ హార్ట్ ను అందించింది కిర్రాక్ సీత, ఇక నిఖిల్, నయని, గౌతమ్ లకు బ్లాక్ హార్ట్ ఇచ్చి.. వారికి కొన్ని సలహాలు ఇచ్చింది సీత. 

సమంత నే కావాలంటున్న ఎన్టీఆర్..
 


అయితే ఈ ఎలిమినేషన్ కరెక్ట్ గానే జరిగిందా అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే సీత చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఆమె అప్పుడప్పుడు కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు కాని.. హౌస్ లో ఆమె కంటే లూజ్ కంటెస్టెంట్స్ చాలామంది ఉన్నారు. అందులోను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి వచ్చి మెహబూబ్ ఈ వారంలో పెద్దగా పెర్పామ్ చేసింది లేదు. నాగార్జున కూడా ఈ విషయాన్ని చెప్పారు. 

అయినా సరే సీతకంటే ఎక్కువ ఓట్లు మెహబూబ్ కు పడే అవకాశం ఎంత వరకూ ఉంది అనేది ఆడియన్స్ నుంచి వస్తున్న ప్రశ్న. అంతే కాదు మెహబూబ్ ఫిజికల్ గేమ్స్, బాగా ఆడుతాడు. కాంట్రవర్సీ కంటెస్టెంట్ గా గత బిగ్ బాస్ లో మెహబూబ్ కు పేరుంది. దాంతో మెహబూబ్ ను కాపాడటం కోసం.. సీతను ఎలిమినేట్  చేశారా అనే అనుమానం ఉంది. 

అయితే వీరిద్దరికి ఓటింట్ లో పెద్దగా తేడా లేకపోవడంతో.. సీత వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. మోహబూబ్ ఎలిమినేషన్ వరకూ వస్తాడని బిగ్ బాస్ టీమ్ కూడా ఊహించి ఉండరు. దాంతో మోహబూబ్ వచ్చింది ఈ వారమే కాబట్టి.. అతన్ని వెంటనే పంపించడం కూడా మంచిది కాదు అనుకున్నట్టున్నారు బిగ్ బాస్ టీమ్. 

సీత  హౌస్ లో ఉంటే ఆట వేరే విధంగా ఉండేది. కాని ఆమెను ఎలిమినేట్ చేసి..  స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను అనవసరంగా బయటకు పంపారు బిగ్ బాస్. సీక్రేట్ రూమ్ లో ఉంచినా బాగుండు అని చాలామంది ఆడియన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ కు ముందు దసరా ఉత్సవాలు బిగ్ బాస్ హౌస్ లో అంబరాన్ని అంటాయి. 

వరుసగా గెస్ట్ లు.. హౌస్ లో ఆటలు పాటలతో దసరా పండగ సందడి.. అటు బిగ్ బాస్ ఇంట్లో ఎంటర్టైన్ చేయడంతో పాటు.. వారి ద్వారా ఆడియన్స్ కూడా  బాగా ఎంటర్టైన్ అయ్యారు. ఈక్రమంలో బిగ్ బాస్ హౌస్ లోకి దసరా సందర్భంగా సింగర్ మంగ్లీతో పాటు, హీరో గోపీచంద్, డైరెక్టర్ శరీను వైట్ల కూడా గెస్ట్ లు గా వచ్చారు. మంగ్లీ తన పాటలతో ఉర్రూతలూగించింది. బతుకమ్మ పోటీ పెట్టి.. ఇంట్లో బతుకమ్మ ఆటలు ఆడించింది. 

హౌస్ లో కూడా రకరకాల టాస్క్ లు.. ఫన్ గేమ్స్ ఆడించారు నాగ్. ఈ పోటీల్లో రాయల్ క్లాన్ విజయం సాధించింది. కొన్ని గేమ్స్ లో ఓజీ క్లాన్ చిన్న చిన్న చోట్ల ఒక్క మార్క్ తేడాతో ఓడిపోయారు. ఇలా సన్ డే ఫన్ డేకు తోడు.. దసరా ఉత్సవాలతో బిబీ తెలుగు హౌస్ కళకళలాడింది. 

Latest Videos

click me!