రాజేంద్ర ప్రసాద్ ఘాడంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

First Published | Oct 13, 2024, 10:00 PM IST

టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనలోని మల్టీ టాలెంట్ అందరికి తెలిసిందే. అయితే ఈ కామెడీ హీరో తనతో ఎక్కువ సినిమాలు చేసిన ఓ హీరోయిన్ ను ఘాడంగా ప్రేమించారని తెలుసా..? అందులో నిజం ఎంత..? 

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ కొంత మందే ఉన్నారు. అందులో ఏ పాత్రలైనా చేయగలిగే నటులు తెలుగు పరిశ్రమలో ఉండటం అదృష్టం ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ లాంటి నటులు ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోతుంటారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా తనకెరీర్ ను స్టార్ట్ చేశాడు. 

Also Read: సమంత నే కావాలంటున్న ఎన్టీఆర్..

కామెడీ హీరోగా, ఆతరువాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, స్టార్ హీరోలకు స్నేహితుడిగా, మల్టీ స్టారర్ మూవీస్ తో పాటు  అనేక రకాల పాత్రలను ఆయన పోషించారు. ప్రస్తుతం హీరోయిన్స్ కు.. యంగ్ హీరోలకు ఫాదర్ క్యారెక్టర్లు కూడా చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. కొన్ని పాత్రలు ఆయన కోసమే పుట్టినట్టు ఉంటాయి. 

Also Read: మహేష్ బాబుతో సినిమా చేసి.. అడ్రెస్ లేకుండా పోయిన్ హీరోయిన్ ఎవరో తెలుసా..?


ఇక అప్పట్లో హీరోగా ఆయన సినిమా ప్రస్తానం అద్భుతం అని చెప్పాలి.  హీరోయిజం చూపిస్తూనే.. కామెడీ టైమింగ్ తో.. రైమింగ్ తో అభిమానులకు గిలిగింతలు పెట్టించేవాడు రాజేంద్ర ప్రసాద్.

ఇక ఆయనతో నటించిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. స్టార్ హీరోయిన్లు కూడా ఆయన సరసన నటించి మెప్పించారు. ఇక ఆ హీరోయిన్లలో ఒకరితో రాజేంద్ర ప్రసాద్ ప్రేమలో పడ్డారని ఓ రూమర్ చక్కర్లు కొట్టింది. 
Also Read: రజనీకాంత్ పాడిన ఏకైక సూపర్ హిట్ సాంగ్..

అప్పడు.. ఇప్పుడు కూడా ఈ విషయం వైరల్ అవుతూ ఉంటుంది. ఈక్రమంలోనే రాజేంద్ర ప్రసాద్ తో పాటు.. ఆహీరోయిన్ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. రజినీ.

తెలుగు సినిమాల్లో అది కూడా రాజేంద్ర ప్రసాద్ తో ఎక్కువ సినిమాల్లో నటించిన ఈ సీనియర్ తార.. రానురాను సినిమాలకు దూరం అయ్యింది. అయితే అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ రజినీ ప్రేమలో పడ్డారని..రూమర్లు గట్టిగా వినిపించాయి. 

Also Read: ఐశ్వర్య రాయ్ కి వింత వ్యాధి,

ఈ విషయంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ తో ఇలా రూమర్లు రావడం సహజమే అందులో వింతేముంది అన్నారు. అయితే ఈ విషయంలో ఏమూలనా.. ఏ కోశానా కొంతైనా నిజం లేదంటారా అని యాంకర్ అడగ్గా.. అందరు అనగా అనగా.. అభిమానం పెరుగుతంది కాని.. వాళ్లు ప్రచారం చేసినంతగా ఏదీ ఉండదు అన్నట్టు మాట్లాడారు రాజేంద్ర ప్రసాద్. 

Also Read:  బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

ఇక రజినీ పెళ్ళి తరువాత ఇండస్రీకి దూరం అయ్యింది ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ముగ్గుురు పిల్లల తరువాత తన భర్తకు విడాకులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా టాలీవుడ్ లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీ.. బిజీగా ఉన్నారు.

రీసెంట్ గా తన కూతురు గుండెపోటుతో మరణించడంతో.. డిప్రెషన్ లో ఉన్నారు రాజేంద్ర ప్రసాద్. ఆయన్ను ఓదార్చడం ఎవరి వల్ల  కావడంలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్స్ అంతా ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించి వస్తున్నారు. 

Latest Videos

click me!