`వార్‌ 2` తెలుగు రైట్స్ కోసం నిర్మాతలు పోటీ.. ఏకంగా రూ.110కోట్లు, దక్కేది ఎవరికి?

Published : May 23, 2025, 11:44 PM IST

`వార్ 2` టీజర్ సంచలనం సృష్టిస్తుంది. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. దీంతో ఈ మూవీకి భారీ డిమాండ్‌ ఏర్పడుతుంది. తాజాగా తెలుగు రైట్స్ లెక్కలు షాకిస్తున్నాయి. 

PREV
16
`వార్‌ 2` పై అంచనాలు పెంచేసిన టీజర్‌

`వార్ 2` టీజర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అభిమానుల్లోనూ అంచనాలు పెరిగాయి. సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

26
`వార్‌ 2` తెలుగు రైట్స్ కోసం భారీ డిమాండ్‌

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌ నటించిన ఈ స్పై థ్రిల్లర్, తెలుగు డిస్ట్రిబ్యూటర్ల మధ్య పోటీని పెంచింది. తెలుగు నుంచి భారీ ఆఫర్‌ వచ్చిందట. ఏకంగా రూ.110 కోట్ల వరకు అడుగుతున్నట్టు తెలుస్తుంది.

36
ఎన్టీఆర్‌ నటించడంతో తెలుగులో `వార్‌ 2`కి విపరీతమైన క్రేజ్‌

  అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన స్పై థ్రిల్లర్ `వార్ 2` ఆగస్టు 14న విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుంది.  ఇటీవల ఎన్టీఆర్‌ పుట్టిన రోజున విడుదలైన `వార్ 2` టీజర్ కి మంచి స్పందన రావడంతో తెలుగు డిస్ట్రిబ్యూటర్లు క్యూరియాసిటీతో ఉన్నారు. తెలుగు రైట్స్ కోసం పోటీపడుతున్నారు.

46
`వార్‌ 2` తెలుగు రైట్స్ కోసం పోటీ పడుతున్నది వీరే

తెలుస్తున్న సమాచారం మేరకు  `వార్‌ 2` చిత్ర నిర్మాతలకు పలువురు డిస్ట్రిబ్యూటర్ల నుండి వాపసు లేని అడ్వాన్స్ (NRA) ప్రతిపాదనలు వచ్చాయట. మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఏసియన్ సినిమా వంటి పలువురు డిస్ట్రిబ్యూటర్లు `వార్ 2` నిర్మాతలకు NRA ప్రతిపాదనలు ఇచ్చారట.

56
తెలుగు రైట్స్ కోసం 100 కోట్లు ఆఫర్‌ చేసిన ఏసియన్‌ సినిమా

దీంతో `వార్ 2` కి బిడ్డింగ్ ₹90 కోట్ల నుండి ₹110 కోట్లకు చేరి, అత్యంత డిమాండ్ ఉన్న చిత్రంగా నిలిచింది.   YRF ప్రస్తుతం అత్యధిక బిడ్లను పరిశీలిస్తోంది. హిందీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ల కోసం తెలుగు రాష్ట్రాల్లో ₹100 కోట్లు ఆఫర్ చేసిన ఏసియన్ సినిమా ముందంజలో ఉందని తెలుస్తుంది. 

66
ఎన్టీఆర్‌ వల్లే `వార్‌ 2` తెలుగు రైట్స్ కి హైప్‌

దిల్‌ రాజు, మైత్రీ నిర్మాతలు, నాగవంశీ వంటి నిర్మాతలు తెలుగు రైట్స్ కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో మరి ఎవరికి `వార్‌ 2` రైట్స్ దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. తెలుగులో తారక్‌కి బలమైన మార్కెట్ ఉంది. అందుకే వంద కోట్లు అయినా పెట్టేందుకు నిర్మాతలు వెనకాడటం లేదు. మరి ఫైనల్‌గా ఇది ఎంతకు తెగుతుందో, ఎవరికి ఈరైట్స్ దక్కుతాయో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories