నాలో ఇంకా ఆ ఫైర్‌ తగ్గలేదు.. సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతున్నారనే వార్తలపై కమల్‌ క్రేజీ రియాక్షన్‌

Published : May 23, 2025, 10:45 PM IST

లోక నాయకుడు కమల్‌హాసన్ త్వరలోనే నటనకు గుడ్‌ బై చెప్పబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా దీనిపై కమల్‌ స్పందించారు. 

PREV
15
నటనకు గుడ్‌ బై అనే వార్తలపై కమల్‌ స్పందన

లోకనాయకుడు, ఇండియన్‌ సినిమా దిగ్గజం  కమల్‌హాసన్ త్వరలో రిటైర్‌మెంట్‌ తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై కమల్‌ స్పందించారు.  ఆయన చెబుతూ, తన యాక్టింగ్‌ టాలెంట్‌ ఇంకా తగ్గిపోలేదని ఆయన స్పష్టం చేశారు. కమల్‌హాసన్ నటించిన 'థగ్ లైఫ్' చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో రిటైర్‌మెంట్‌పై ఆయన క్లారిటీ ఇచ్చారు. 

ఒక ఇంటర్వ్యూలో కమల్‌ మాట్లాడుతూ, `నేను సినిమా నుంచి వెళ్లిపోవాలని ప్రస్తుతం అనుకోవడం లేదని,  నటన అంటే తనకు ప్రాణమని,  అదే తన అభిరుచి అని,  ఒక యాక్టర్‌గా ఇంకా ఎన్నో అద్బుతమైన పాత్రలు పోషించాలనే తపన తనలో ఉందని ఆయన తెలిపారు. 

25
ఆ జ్వాల ఇంకా వెలుగుతూనే ఉందిః కమల్‌

కమల్‌ ఇంకా మాట్లాడుతూ, `సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక శక్తివంతమైన మాధ్యమం. కథల ద్వారా సమాజంలోని లోపాలను సరిదిద్దడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఈ బాధ్యత నుంచి నేను వెనుకడుగు వేయను. నాలోని ఆ 'జ్వాల'(ఫైర్‌) ఇంకా వెలుగుతూనే ఉంది, అది ఆరిపోయే వరకు నేను నటిస్తూనే ఉంటాను` అని స్పష్టం చేశారు కమల్‌. 

35
మూడున్నర దశాబ్దాల తర్వాత కమల్‌, మణిరత్నం కలయిక

కమల్‌ చాలా కాలం తర్వాత  'విక్రమ్' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. కమల్‌ ఈజ్‌ బ్యాక్‌ అనిపించుకున్నారు. ఆ తర్వాత చేసిన `ఇండియన్‌ 2` డిజాస్టర్‌ అయ్యింది. ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో `థగ్‌ లైఫ్‌` మూవీ చేశారు.  దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ మూవీకి కమల్‌, మణిరత్నం కలిసి పని చేస్తున్నారు. 'థగ్ లైఫ్'  జూన్ 5న విడుదల కానుంది.  

45
కమల్‌ క్లారిటీతో ఊపిరి పీల్చుకున్న అభిమానులు

నటన, దర్శకత్వం, నిర్మాణం, స్క్రీన్‌ప్లే, పాటలు, నృత్యం ఇలా సినిమాలోని అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసిన కమల్‌, భారతీయ సినిమా చూసిన అరుదైన కళాకారుల్లో ఒకరు. అలాంటి కమల్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతున్నారనే వార్త వారి అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అయితే దీనిపై కమల్‌ క్లారిటీ ఇవ్వడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు.  ఇంకా మరెన్నో గొప్ప పాత్రలు, ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

55
జూన్‌ 5న గ్రాండ్‌గా `థగ్‌ లైఫ్‌` రిలీజ్‌

కమల్‌ హాసన్‌ హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన `థగ్‌ లైఫ్‌` చిత్రంలో శింబు, త్రిష, అభిరామి, నాజర్, తనికెళ్ల భరణి, అశోక్‌ సెల్వ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిరత్నం, కమల్‌ నిర్మాతలు. జూన్‌ 5న ఈ మూవీ తమిళం, తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళంలోనూ విడుదల కాబోతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories