`డబ్బా రోల్‌` వివాదంపై సిమ్రాన్‌ క్లారిటీ.. ఎవరికి తగలాలో వారికి తగిలాయి

Published : May 23, 2025, 11:18 PM IST

నటి సిమ్రాన్ తాను చేసిన 'డబ్బా రోల్' అనే వివాదాస్పద వ్యాఖ్యల గురించి స్పందించింది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. 

PREV
14
`డబ్బా రోల్‌` వివాదంలో సిమ్రాన్‌

'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా విజయంతో ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు సిమ్రాన్‌. సెకండ్‌ ఇన్నింగ్స్ లో ఆమెకి మంచి కమ్‌ బ్యాక్‌ ఇచ్చిందీ మూవీ. అదే సమయంలో, ఇటీవల ఆమె `డబ్బా రోల్` అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారం రేపాయి. దీనిపై తాజాగా వివరణ ఇచ్చింది సిమ్రాన్‌. ఓ ఇంటర్వ్యూలో ఆమె దీనిపై స్పందించారు.  JFW అవార్డ్స్‌లో తాను చేసిన ఉద్వేగపూరిత ప్రసంగం గురించి ఆమె ఓపెన్‌ అయ్యారు.  `డబ్బా రోల్‌` అంటూ ఆ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు 'డబ్బా కార్టెల్' సిరీస్‌లో నటించిన నటి జ్యోతికను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా ప్రచారం జరుగుతుంది. 

24
జ్యోతికని ఉద్దేశించే సిమ్రాన్‌ ఈ వ్యాఖ్యలు చేసిందా?

`ఈ సంవత్సరం ప్రారంభంలో, 'ఆంటీ' పాత్రల్లో నటించినందుకు ఒక కోస్టార్‌ తనను ఎగతాళి చేసిందని, 'డబ్బా రోల్' చేయడం కంటే ఇది మంచిద`ని JFW అవార్డ్స్‌లో సిమ్రాన్ చెప్పారు. ఆమె 'డబ్బా రోల్' అని ప్రస్తావించడంతో  అది జ్యోతికను ఉద్దేశించే ఈ వ్యాఖ్య చేసి ఉండవచ్చని నెటిజన్లు భావించారు. ఎందుకంటే జ్యోతిక నటించిన 'డబ్బా కార్టెల్' అనే వెబ్ సిరీస్ కరెక్ట్ గా అదే సమయంలో విడుదలైంది. 

34
`డబ్బా రోల్‌` కామెంట్‌పై క్లారిటీ ఇచ్చిన సిమ్రాన్‌

దీనికి సిమ్రాన్‌ వివరణ ఇచ్చింది, 'డబ్బా కార్టెల్' మంచి వెబ్ సిరీస్ అని, ప్రజలు తన గత వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నందువల్లే ఇలాంటి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయని అన్నారు. నేను ఏం చెప్పాలనుకున్నానో అది సంబంధిత వ్యక్తికి చేరింది. ఆ వ్యాఖ్యల తర్వాత నాకు ఆమె నుండి ఒక మెసేజ్ వచ్చింది. అందులో, 'క్షమించండి, నేను మిమ్మల్ని బాధపెట్టాలని అనుకోలేదు' అని రాసి ఉంది` అని సిమ్రాన్ తెలిపింది.  వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేసింది. 

44
సిమ్రాన్‌కి బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు హిట్లు

సిమ్రాన్ తమిళంలో నటించిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' వసూళ్ల పరంగా దుమ్ములేపుతుంది. మే 1న   విడుదలైన ఈ చిత్రం, సూర్య 'రెట్రో', నాని 'హిట్ 3' వంటి చిత్రాలతో పోటీ పడినా, 70 కోట్లకు పైగా వసూలు చేసి, ఈ ఏడాది తమిళంలో అత్యధిక లాభాలు ఆర్జించిన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది సిమ్రాన్‌కు వరుసగా రెండు విజయాలు దక్కాయి. గతంలో అజిత్‌తో కలిసి నటించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories