ఓటీటీలో ఎన్టీఆర్ - హృతిక్ యాక్షన్ మూవీ.. వార్ 2 స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే?

Published : Sep 03, 2025, 07:02 PM IST

War 2 OTT Release Date : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్- మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’.ఈ యాక్షన్ సినిమా ఓటిటి‌లో త్వరలో స్ట్రీమింగ్ కానున్నది. 

PREV
15
వార్ 2 ఓటిటి రిలీజ్ డేట్ అప్‌డేట్

War 2 OTT: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ - బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కాంబో వచ్చిన లేటెస్ట్ మూవీ వార్ 2 (War 2). స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా ఊహించినంత రీతిలో రెస్పాన్స్ మాత్రం రాబట్టలేదు. తారక్‌ బాలీవుడ్ ఎంట్రీ కావడం మాత్రమే కాకుండా, హృతిక్ రోషన్‌తో కలిసి నటించడంతో విడుదలకు ముందు ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. 

కానీ తీరా సినిమా విడుదలైన తర్వాత అభిమానుల అంచనాలను తలక్రిందులు చేసింది వార్ 2. మొదట పాజిటివ్ టాక్ అందుకున్న చివరికి బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఈ నేపథ్యంలో ఈ మల్టీ స్టారర్ మూవీ ఎప్పుడు ఓటిటి‌లో స్ట్రీమింగ్ కానున్నదనే చర్చ మొదలైంది. ఇంతకీ వార్ 2 మూవీ ఆన్ లైన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 

25
మూవీ బడ్జెట్, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2 మూవీ బడ్జెట్ సుమారు రూ.400 కోట్లు నిర్మించబడింది. ఈ మూవీ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ముఖ్యంగా ఇది జూనియర్ ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ మూవీ కావడంతో ఫ్యాన్స్‌లో హైప్ పెరిగింది.

భారీ అంచనాలతో ఆగస్టు 14 న థియేటర్లలో విడుదలైంది. కానీ, ఈ సినిమా రిజల్ట్ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయినా, తెలుగులో తారక్‌ క్రేజ్ వల్ల చెప్పుకోదగ్గ కలెక్షన్స్‌ను రాబట్టగలిగింది.

బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే 20 రోజుల్లో ఇండియాలో రూ.234.90 కోట్లు కలెక్ట్ చేయగా.. వరల్డ్‌వైడ్‌గా రూ.357 కోట్లు వసూలు చేసింది. భారీ అంచనాలు విఫలమైనా, తారక్ – హృతిక్ కాంబినేషన్ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చింది.

35
ఓటిటి రిలీజ్ డేట్, ప్లాట్‌ఫారమ్

వార్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వార్ 2 ఓటీటీ హక్కులను ప్రముఖ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.150 కోట్లకు సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ విషయంపై చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి. థియేటర్స్‌లో చూసిన వారు, మిస్ చేసిన వారు. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో రూపొందిన వార్ 2లో యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా తారక్ – హృతిక్ మధ్య వచ్చిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. ఈ యాక్షన్ డ్రామాను థియేటర్స్‌లో రిలీజ్ తర్వాత 6 నుండి 8 వారాల లోపు స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని అంచనా. సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో గాని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

థియేటర్లలో ఆశించినంత స్థాయిలో కలెక్షన్స్ సాధించలేకపోయినా. ఓటిటి రిలీజ్‌తో “వార్ 2” మళ్లీ భారీ క్రేజ్ తెచ్చుకోగలదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ సౌత్ ఇండస్ట్రీలో ఉన్న పాపులారిటీ కారణంగా, ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో పెద్ద స్థాయి ఆడియెన్స్‌ను ఆకట్టుకునే అవకాశం ఉంది.

45
జూనియర్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ మూవీస్ లైనప్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ముందున్న నాలుగేళ్లు ఫుల్ బిజీగా గడపబోతున్నారు. ఇప్పటికే లైనప్‌లో వరుసగా స్టార్ డైరెక్టర్ల సినిమాలు ఉన్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ –నీల్ మూవీ: జూనియర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ మూవీ 2026లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

దేవర 2: కొరటాల శివతో హ్యాట్రిక్ కోసం రెడీ అవుతున్న తారక్. మొదటి పార్ట్ హిట్ కావడంతో దేవర 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్: పురాణాలతో ముడిపడిన కథతో మూవీ తీయనున్నారు. ఈ మూవీలో తారక్ కుమారస్వామి పాత్రలో కనిపించనున్నట్టు టాక్.

NTR–నెల్సన్: జైలర్ డైరెక్టర్‌తో చర్చలు జరుగుతున్నాయి. ఈ కాంబో ఓకే అయితే బాక్సాఫీస్ దుమ్ము రేపడం ఖాయం. ఇలా వరుసగా క్రేజీ సినిమాలు లైన్‌లో ఉండటంతో తారక్ ఫ్యాన్స్ గర్వంగా చెబుతున్నారు. ఇలా మరో నాలుగేళ్లు తారక్ బిజీబిజీగా ఉండబోతున్నారు.

55
హృతిక్ రోషన్ వర్క్ ఫ్రంట్

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ప్రస్తుతం వరుసగా పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. యాక్షన్, సూపర్‌హీరో, మైథాలజికల్ జానర్స్‌లో సినిమాలు చేయబోతున్న హృతిక్ లైనప్ చూసి అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. గత నెలలో వార్ 2 (War 2)సినిమాతో ప్రేక్షకులను పలుకరించారు. కానీ, అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు.

క్రిష్ 4 (Krrish 4): సూపర్‌హీరో ఫ్రాంచైజీ క్రిష్ సిరీస్ లో క్రిష్ 4 రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా హృతిక్ మళ్లీ తన సూపర్‌హీరో అవతారంలో కనిపించబోతున్నారు. రాకేష్ రోషన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2025లోనే థియేటర్లలోకి రానుంది.

బ్రహ్మాస్త్ర భాగ్ 2: దేవ్ (Brahmastra Part Two:Dev): బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. ఈ విజువల్ వండర్‌ మూవీలో హృతిక్ రోషన్ “దేవ్” పాత్రలో కనిపించే అవకాశం ఉంది.

మహాభారత (Mahabharat): దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించబోతున్న మహాకావ్యం మహాభారతలో హృతిక్ రోషన్ “అర్జునుడు” పాత్ర పోషించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఫైటర్ 2 (Fighter 2), అల్ఫా (Alpha)సినిమాలు రానున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories