వార్ 2లో శృతి మించిన కియారా అద్వానీ బికినీ సీన్స్, సెన్సార్ బోర్డు ఏం చేసిందో తెలుసా ?

Published : Aug 10, 2025, 08:24 PM IST

వార్ 2 మూవీలో కియారా అద్వానీ బికినీ సన్నివేశాలకు సంబంధించి ఊహించని షాక్ ఎదురైంది. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం. 

PREV
15
వార్ 2 రిలీజ్ కి రెడీ 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 మూవీ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ మూవీగా ఈ చిత్రం రూపొందింది. వార్ మొదటి భాగం గ్రాండ్ సక్సెస్ కావడంతో వార్ 2పై అంచనాలు పెరిగాయి. 

25
బికినీలో కియారా గ్లామర్ 

ఈసారి హృతిక్ తో ఎన్టీఆర్ నటించడంతో సౌత్ లో కూడా ఈ చిత్రంపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. సిల్వర్ స్క్రీన్ పై ఆడియన్స్ కి కళ్ళు చెదిరే యాక్షన్ విందు గ్యారెంటీ అంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు హృతిక్, ఎన్టీఆర్ తో పాటు కియారా అద్వానీ కూడా మాత్రం తగ్గడం లేదు. యాక్షన్ సీన్స్ చేస్తూనే బికినీలో గ్లామర్ ఒలకబోసింది. ట్రైలర్, టీజర్స్ లో ఆమె బికినీ దృశ్యాలు ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించాయి. 

35
బికినీ సీన్లకు కత్తెర 

అయితే సెన్సార్ బోర్డు మాత్రం చిత్ర యూనిట్ కి ఊహించని షాక్ ఇచ్చింది. కియారా అద్వానీ బికినీ సన్నివేశాలు కొన్ని చోట్ల శృతి మించే విధంగా ఉండడంతో కత్తెర్లు వేసిందట. కియారా అద్వానీ బికినీ సన్నివేశాల్లో దాదాపు సగం సీన్లని సెన్సార్ బోర్డు ట్రిమ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కియారా ఆవన్ జావన్ అనే సాంగ్ లో బికినీలో మెరిసింది. 

45
వివాదాస్పద డైలాగ్స్ 

కియారా బికినీ సీన్స్ మాత్రమే కాకుండా కొన్ని వివాదాస్పద డైలాగ్స్ ని కూడా సెన్సార్ వాళ్ళు తొలగించినట్లు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదట. 

55
దేశం కోసం ఏమైనా చేసే సైనికులు 

ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య పోరాట సన్నివేశాలు కళ్ళు చెదిరేలా ఉంటాయని అంటున్నారు. ఇద్దరూ దేశం కోసం ఏమైనా చేసే సైనికులుగా కనిపిస్తున్నారు. అలాంటి వీరి మధ్య వైరం ఎందుకు వచ్చింది అనేది ఈ చిత్ర కథ. 

Read more Photos on
click me!

Recommended Stories