ఈసారి బిగ్ బాస్‌నే మార్చేశా, రెండు హౌస్ లతో ఇక రణరంగమే.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున

Published : Aug 10, 2025, 07:13 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లేటెస్ట్ ప్రోమో వైరల్ గా మారింది. ఈసారి బిగ్ బాస్ లో 2 హౌస్ లు ఉంటాయని చెప్పిన నాగార్జున మరో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ కూడా ఇచ్చారు. 

PREV
15
త్వరలో బిగ్ బాస్ తెలుగు 9

కింగ్ నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కి కూడా హోస్ట్ గా కొనసాగబోతున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఈసారి బిగ్ బాస్ లో ఊహించని మార్పులు చాలా ఉండబోతున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. మొదటి సీజన్ నుంచి 8వ సీజన్ వరకు బిగ్ బాస్ షో ఒకే పంథాలో సాగింది. దీనితో ఆడియన్స్ బిగ్ బాస్ రొటీన్ అయిపోయింది అని కామెంట్స్ చేయడం ప్రారంభించారు. సీజన్ 8 కూడా అంతగా క్లిక్ కాలేదు. అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు బిగ్ బాస్ రూల్స్, హౌస్ మొత్తం మార్చేసి ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. 

25
బిగ్ బాస్ తెలుగు 9 లేటెస్ట్ ప్రోమో 

తాజాగా విడుదలైన ప్రోమోని నాగార్జున, వెన్నెల కిషోర్ మధ్య ఆసక్తికరంగా చిత్రీకరించారు. వెన్నెల కిషోర్ తన మేనేజర్ కి ఫోన్ చేసి తన నెక్స్ట్ 100 డేస్ షూటింగ్ షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ చేయమని చెబుతాడు. బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్లాలనుకుంటున్నా అందుకే ఇతర షూటింగ్స్ చేయమని చెబుతాడు. తన కారు డ్రైవర్ రియాక్ట్ అవుతూ.. మీకు బిగ్ బాస్ లోకి వెళ్లాలనే ప్లానింగ్ ఉంటే సరిపోదు సార్.. ఆ 9 గ్రహాల బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి అని అంటాడు. 

35
బిగ్ బాస్ హౌస్ ని ఏలడానికి వాచ్చా 

ఆ గ్రహాల కామన్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అని వెన్నెల కిషోర్ అడగడంతో.. కమాండింగ్ ఫ్రెండ్ ఉన్నాడు అని డ్రైవర్ అంటాడు. అప్పుడు నాగార్జున ఎంట్రీ ఉంటుంది. నాగార్జున.. వెన్నెల కిషోర్ తో.. ఏం కిషోర్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి వచ్చావా అని అడుగుతారు. వెన్నెల కిషోర్ స్పందిస్తూ.. పొరపాటు పడుతున్నారు వెళ్ళడానికి కాదు ఏలడానికి వచ్చా అని గర్వంగా చెబుతాడు. 

45
ఈసారి బిగ్ బాస్ లో 2 హౌస్ లు 

నాగార్జున ఒక నవ్వు నవ్వి.. అది నీవల్ల కాదు ఈసారి వెరీ టఫ్ అని చెబుతారు. ఈ హౌస్ గురించి తెలుసుకున్నావా అని నాగార్జున అడిగితే.. ఇంతకు ముందు ఉన్న సేమ్ హౌస్ కదా అని వెన్నెల కిషోర్ అంటాడు. నాగార్జున బదులిస్తూ.. అస్సలు కాదు ఈసారి రెండు హౌస్ లు ఉండబోతున్నాయి. డబుల్ హౌస్ డబుల్ డోస్ అని ట్విస్ట్ ఇస్తాడు. ఈసారి హౌస్ లో ఎవ్వరూ పర్మనెంట్ కాదని కూడా నాగార్జున చెబుతారు. 

55
బిగ్ బాస్ ని కూడా మార్చేశా 

నేను డైరెక్ట్ గా వెళ్లి బిగ్ బాస్ తోనే మాట్లాడుకుంటా అని వెన్నెల కిషోర్ అనడంతో.. నాగార్జున మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చారు. ఈ సారి బిగ్ బాస్ ని కూడా మార్చేశా. హౌస్ లో అందరి సరదాలు తీరిపోతాయి. ఈసారి చదరంగం కాదు రణరంగమే అని అని నాగార్జున చెప్పడం హైలైట్ గా నిలిచింది.  

Read more Photos on
click me!

Recommended Stories