కమల్ హాసన్‌కి బెదిరింపులు.. నటుడు రవిచంద్రన్ పై కేసు.. గొడవేంటంటే?

Published : Aug 10, 2025, 06:59 PM IST

కమల్ హాసన్ కి బెదిరింపు కాల్స్ వచ్చాయి. `మక్కల్ నీది మయ్యం` పార్టీ వాళ్ళు చెన్నై పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. నటుడు రవిచంద్రన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. 

PREV
15
కమల్ హాసన్ కి బెదిరింపు కాల్స్

సనాతన ధర్మం గురించి మాట్లాడిన మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ కి నటుడు రవిచంద్రన్ చంపేస్తామని బెదిరింపు కాల్స్ చేసినట్టు చెన్నై పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు అందింది.

DID YOU KNOW ?
`కల్కి 2898 ఏడీ`లో నెగటివ్‌ రోల్‌
కమల్‌ హాసన్‌ విలక్షణ నటుడు. హీరోగా, విలన్‌గా మెప్పిస్తారు. `కల్కి 2898 ఏడీ`లో ఆయన నెగటివ్‌ రోల్‌ చేశారు. కాకపోతే కాసేపే కనిపించారు. రెండో పార్ట్ లో ఆయన పాత్ర ప్రధానంగా ఉండబోతుంది.
25
పోలీస్‌లకు ఫిర్యాదు చేసిన కమల్‌ పార్టీ నాయకులు

`మక్కల్ నీది మయ్యం` పార్టీ ఉపాధ్యక్షుడు, రిటైర్డ్ ఐజీ మౌర్యా, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి చెన్నై పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. నటుడు రవిచందర్‌పై చర్యలు తీసుకోవాలని వారు పోలీస్‌లను కోరారు. అగరం ఫౌండేషన్ వేడుకలో కమల్ హాసన్ సనాతన ధర్మం గురించి మాట్లాడారు. దీనికి వ్యతిరేకంగా నటుడు రవిచంద్రన్ కమల్ ని చంపేస్తామని బెదిరించినట్టు మక్కల్ నీది మయ్యం పార్టీ ఫిర్యాదులో పేర్కొంది.

35
పోలీసుల విచారణ

ఈ సంఘటన గురించి 30 మందికి పైగా మక్కల్ నీది మయ్యం పార్టీ నాయకులు పోలీస్ కమిషనర్ ని కలిసి చర్యలు తీసుకోమని కోరారు. ఫిర్యాదుని తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. తాజాగా ఈ విషయం తమిళనాట పెద్ద రచ్చ లేపుతుంది. 

45
ఎంపీగా ఎంపికైన కమల్‌ హాసన్‌

కమల్‌ హాసన్‌కి ఇటీవల డీఎంకే రాజ్యసభ ఎంపీ సీటుని కేటాయించింది. గత లోక్‌ సభ ఎన్నికల్లో డీఎంకేతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా కమల్‌కి ఎంపీ సీటుని కేటాయించింది డీఎంకే. దీంతో ఇటీవలే ఆయన ఎంపిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

55
కమల్‌ వరుస ఫెయిల్యూర్స్

`విక్రమ్‌`తో కెరీర్‌ బెస్ట్ హిట్ అందుకున్న కమల్‌ హాసన్‌ ఆ తర్వాత వరుసగా పరాజయాలు ఫేస్‌ చేశారు. `భారతీయుడు 2` డిజప్పాయింట్‌ చేసింది. ఇటీవల `థగ్‌ లైఫ్‌` కూడా ఆడలేదు. కానీ ఇది ఓటీటీలో మాత్రం బాగా ఆదరణ పొందింది. మరోవైపు `కల్కి 2898ఏడీ`లో చివర్లో కాసేపు మెరిశారు. రెండో పార్ట్ లో ఆయన పాత్ర కీలకంగా ఉండబోతుంది. ఇక ఆయన హీరోగా కొత్త ప్రాజెక్ట్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories