వీరయ్య, వీర సింహారెడ్డి ఇంత అత్యాశ అవసరమా.. టికెట్ ధరలతో బాంబు, బాక్సాఫీస్ వద్ద బిగ్ లాస్ ?

First Published Jan 5, 2023, 12:45 PM IST

2023 సంక్రాంతి ఫైట్ టాలీవుడ్ లో రసవత్తరంగా మారుతోంది. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు బిగ్గెస్ట్ క్లాష్ కి సిద్ధం అవుతున్నాయి.

2023 సంక్రాంతి ఫైట్ టాలీవుడ్ లో రసవత్తరంగా మారుతోంది. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు బిగ్గెస్ట్ క్లాష్ కి సిద్ధం అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలని నిర్మించింది మైత్రి మూవీస్ సంస్థే కావడం విశేషం. 

జనవరి 12న వీరసింహారెడ్డి , 13న వాల్తేరు వీరయ్య చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. దీనితో ఏ చిత్రం ఎలా ఉండబోతోంది.. కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటూ అభిమానుల్లో, టాలీవుడ్ లో చర్చ మొదలైంది. వీటితో పాటు రెండు తమిళ చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో నిలిచాయి. విజయ్ వారసుడు చిత్రాన్ని దిల్ రాజు నిర్మించడం, ఆ చిత్రాన్ని తెలుగు హీరోలకు పోటీగా దింపుతుండడంతో పెద్ద రచ్చే జరిగింది. మరోవైపు అజిత్ కూడా తెంగింపు అంటూ వచ్చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా బాలయ్య, చిరంజీవి చిత్రాల్ని చూడడానికి అభిమానులు ఎగబడతారు. ఇక సంక్రాంతి సీజన్ కాబట్టి ఆ హంగామా రెట్టింపు ఉంటుంది. అయినా కూడా నిర్మాతలు అత్యాశతో ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నైజాం ఏరియాలో ఈ రెండు చిత్రాలకు భారీగా టికెట్ ధరలు పెంచుకునేందుకు, అదనపు షోలు వేసుకునేందుకు నిర్మాతలు తెలంగాణ ప్రభుత్వానికి అప్లై చేసినట్లు తెలుస్తోంది. 

తెలంగాణ ప్రభుత్వం కనుక అనుమతి ఇస్తే ప్రేక్షకులపై టికెట్ ధరల బాంబు పడ్డట్లే.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ పై. సంక్రాంతికి ఫ్యామిలీ మొత్తం థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలనుకుంటారు. మైత్రి నిర్మాతలు సింగిల్ స్క్రీన్ లో 175, మల్టిఫ్లెక్స్ లలో రూ 295 టికెట్ ధరలు ఫిక్స్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఫ్యామిలీ ఈ ధరలతో సినిమా చూడాలంటే రూ 1200 వరకు ఖర్చు అవుతుంది. పార్కింగ్ చార్జీలు, తినుబండారాలు కలుపుకుంటే దాదాపు 2000 రూపాయలతో జేబుకి చిల్లు పడుతుంది. 

ఫ్యామిలీ ఆడియన్స్ తప్పనిసరిగా సంక్రాంతికి సినిమా చూడాలనుకుంటారు కాబట్టి దానిని క్యాష్  చేసుకోవాలని మైత్రి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఈ రెండు చిత్రాల లాంగ్ రన్ దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి. బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం ఉంటుంది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 

గత ఏడాది చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఎంత దారుణమైన డిజాస్టర్ గా నిలిచిందో తెలిసిందే. చిరంజీవి చిత్రాలకు వచ్చే మినిమమ్ వసూళ్లు కూడా రాలేదు. దానికి కారణం పెంచిన టికెట్ ధరలే. టికెట్ రేట్లు నార్మల్ గా ఉండి ఉంటే వసూళ్లు కూడా ఇంకా బెటర్ గా ఉండేవి. 

సగటు ప్రేక్షకులు టికెట్ ధరలు చూసి ఓటిటిలో చూసుకుందాం లే అని భావించే ప్రమాదం లేకపోలేదు. మీడియం రేంజ్, చిన్న చిత్రాలు టికెట్ ధరల వల్ల ఎలా ఇబ్బందులు పడుతున్నాయి తెలిసిందే. సో మైత్రి నిర్మాతలు అత్యాశకు పోకుండా టికెట్ ధరలు నార్మల్ గా ఉంచితే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

click me!