నటి సాయి పల్లవి మార్కెట్ ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. తన నటన, డ్యాన్స్, నేచురల్ అందంతో సాయి పల్లవి కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకుంది. రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న ఆమె, నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం రామాయణం కోసం రూ.18 నుంచి రూ.20 కోట్ల వరకు పారితోషికం తీసుకోనుంది. దీంతో దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా సాయిపల్లవి మారింది.