Viswa Eliminated: బిగ్‌ బాస్ ‌5లో బిగ్‌ షాక్‌.. షణ్ముఖ్‌, రవి, ప్రియాంక, శ్రీరామ్‌లపై విశ్వ హాట్‌ కామెంట్‌

First Published | Nov 7, 2021, 11:26 PM IST

బిగ్‌ బాస్‌ 5లో తొమ్మిదో వారం ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరూ ఊహించని విధంగా విశ్వ ఈ వారం ఎలిమినేట్‌ అయ్యాడు. ఇంటి సభ్యుల హార్ట్ బరువెక్కేలా చేశాడు. ఆ తర్వాత హౌజ్‌మేట్స్ పై విశ్వ హాట్‌ కామెంట్‌ చేశాడు. ముఖ్యంగా షణ్ముఖ్‌, శ్రీరామ్‌, రవిలపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5) తొమ్మిది వారం.. వారంతమైన ఆదివారం ఫన్సీ ఇన్స్ డెంట్స్‌తోపాటు ఎమోషనల్‌ సన్నివేశాలతో సాగింది. ఉత్కంఠభరితమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. మొదటగా ఫన్‌తో ప్రారంభించారు హోస్ట్ నాగార్జున(Nagarjuna). శని, ఆదివారాల్లో నాగ్‌ వచ్చి సందడి చేస్తుంటాడనే విషయం తెలిసిందే. ఆదివారం ఎపిసోడ్‌లో ఆయన మొదట ఓ గేమ్‌ పెట్టాడు. ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విడగొట్టి సినిమాల్లోని పాటల చిత్రాలను సగం చూపిస్తూ ఆ పాటని గురించాలనే టాస్క్ ఇచ్చాడు. 
 

టీమ్‌ ఏకి సన్నీ కెప్టెన్‌గా ఉండగా, షణ్ముఖ్‌, ప్రియాంక, కాజల్‌ విశ్వ సభ్యులుగా ఉన్నారు. మరోవైపు టీమ్‌ బీకి రవి కెప్టెన్‌గా, శ్రీరామ్‌, సిరి, మానస్‌, అనీ మాస్టర్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ గేమ్‌ ఆద్యంతం కామెడీ, హుషారుగా సాగింది. ఇందులో ఎక్కువ రైట్స్ ఆన్సర్స్ చెప్పి టీమ్‌ బీ విజయం సాధించింది. అనంతరం నామినేషన్‌లో ఉన్న శ్రీరామ్‌, కాజల్‌, విశ్వ, జెస్సీ, ప్రియాంకలలో శ్రీరామ్‌ని సేవ్‌ చేశారు. 


అనంతరం `నీవు ఎవరు` అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో కుండిలో ఉన్న చిట్టీల్లో ఉన్న పేరుని యాక్టింగ్‌తో చేసి చూపించాలి.దాన్ని ఆ టీమ్‌ వాళ్లు గెస్‌ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఇందులో చాలా ఫన్సీ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఫైనల్‌గా ఎక్కువ కరెక్ట్ చెప్పి ఏ టీమ్‌ విజయం సాధించింది. లెక్క బరాబర్‌ అయ్యింది. 
 

మరోవైపు నామినేషన్‌లో ఉన్న నలుగురు కాజల్‌, విశ్వ, జెస్సీ, ప్రియాంకలలో ఒకరిని సేవ్‌ చేయగా, జెస్సీ సేవ్‌ అయ్యాడు. మరోవైపు హౌజ్‌లో వరస్ట్ పర్ఫెర్మెన్స్ గేమ్‌లో ఎక్కువ మార్కులు పడ్డా కాజల్‌ని వరస్ట్ పర్‌ఫెర్మెర్‌గా ఫైనల్‌ చేశారు. ఆమెని రేపు(సోమవారం) ఎపిసోడ్‌లో జైలుకి పంపాల్సి ఉంటుంది. మరోవైపు నామినేషన్లలో ఉన్న ముగ్గురు విశ్వ, కాజల్‌, ప్రియాంకలలో ప్రియాంక సేవ్‌ అయ్యింది. ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు అసలు మజా ప్రారంభమైంది. 

ఫైనల్‌గా ఎలిమినేషన్‌కి కాజల్‌, విశ్వ మిగిలారు. గార్డెన్‌ ఏరియాలో రెండు పెద్ద పెట్టేలు ఏర్పాటు చేసి అది ఓపెన్‌ చేస్తే ఎవరి బాక్స్ నుంచి బెలూన్స్‌ పైకి ఎగరతాయో వాళ్లు సేవ్‌, ఎగరని వాళ్లు ఎలిమినేటెడ్‌. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎలిమినేషన్‌ ప్రాసెస్‌లో విశ్వ ఎలిమినేట్‌(Viswa Eliminated) అయ్యాడు. ఎవరూ ఊహించని విధంగా Viswa Eliminate కావడం ఇంటి సభ్యులను భావోద్వేగానికి గురి చేసింది. 

గుండె బరువెక్కించింది. ఈ వారం హౌజ్‌లో అందరిచేత హీరోగా అనిపించుకున్న విశ్వ ఎలిమినేట్‌ అని తెలిసి అనీ మాస్టర్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సన్నీ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. శ్రీరామ్‌ అయితే షాక్‌లోకి వెళ్లిపోయాడు. హౌజ్‌మేట్స్ కి వీడ్కోలు చెప్పే క్రమంలో విశ్వ కూడా ఎమోషనల్‌ అయ్యారు. 

ఇక నాగార్జున వద్దకి వెళ్లిన విశ్వ.. ఇంటి సభ్యులకు ర్యాంకులివ్వాల్సి ఉంది. ఇందులో విశ్వ పది నుంచి ఒకటికి ఇచ్చుకుంటూ వెళ్లాడు. ఇందులో భాగంగా ఆయన మొదట ప్రియాంకకి పదవ ర్యాంక్ ఇచ్చాడు. హౌజ్‌లోకి వచ్చిన మొదట్లో హార్ట్ కి కనెక్ట్ అయిన అమ్మాయి అని, తనని తప్పుగా అర్థం చేసుకున్నావని అన్న మాట బాధగా అనిపించిందని, తప్పు చేయడం తప్పు కాదు, రియలైజ్‌ కాకపోవడం తప్పు అని చెప్పాడు. ఇక కాజల్‌కి తొమ్మిదో ర్యాంక్‌ ఇస్తూ డల్ అవుతున్నావని, కాన్ఫిడెన్స్ ని కోల్పోతున్నావని చెప్పాడు. తన ఆట తనలా ఆడాలని చెప్పాడు. జెస్సీకి ఎనిమిదో ర్యాంక్‌ ఇస్తూ టాస్క్ లో ఊహించిన విధంగా గివప్‌ ఇచ్చావని, బాగా ఆడాలని తెలిపాడు. 
 

అనీ మాస్టర్ కి ఏడో ర్యాంక్‌ ఇస్తూ, ఆటలోవెనకడుగు వేయోద్దని, తన ఆటని ఆడాలని తనొక ఫైటర్‌ అని వర్ణించి అభినందించాడు విశ్వ. మానస్‌కి ఆరో ర్యాంక్‌ ఇస్తూ విన్నింగ్, లూజింగ్‌ కామన్‌ అని, ఓడిపోయినా దాన్ని స్వీకరించి మరింత ముందుకు పోవాలని, డల్‌ కావద్దని చెప్పాడు. సిరికి ఐదో ర్యాంక్‌ ఇస్తూ తనొక స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని, ఆటలో దూకుడుమీదుంటుందని, ఎవరికైనా ఇచ్చిపడేస్తుందన్నాడు. టాప్‌ 5లో ఉండాలన్నాడు. సన్నీకి నాలుగో ర్యాంక్‌ ఇచ్చాడు విశ్వ. బాగా ఆడుతున్నావని, మంచి గేమర్‌ అని చెబుతూ, తనలోని ఫైర్‌ తగ్గిందని, ఆది తగ్గకుండా తన ఆట ఆడాలని, అలా ఆడితే గేమ్‌నే అటు ఇటూగా మార్చే సత్తా ఉందని అభినందించాడు. 

షణ్ముఖ్‌కి మాత్రం గట్టిగా ఇచ్చాడు విశ్వ. ఫస్ట్ వీక్‌లో చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించి తనకు గైడ్‌చేసేవాడని కానీ టాస్క్ లో ఓడిపోతే లో అయిపోతాడని, కింద కుంపటి పెట్టినట్టే వీక్‌ అయిపోతున్నాడని, దాన్నుంచి బయటపడాలని షాకింగ్‌ కామెంట్‌ చేశాడు. రవి గురించి చెబుతూ, రవి గుంట నక్క కాదని, తను చాలా మంచి వ్యక్తి అని, బాగా టాస్క్ లు ఆడతాడని తెలిపారు. సూర్యుడు ఎప్పుడూ హైలోనే ఉంటాడని, రవి కూడా అలా ఉండాలన్నాడు. అంతేకాదు ఈ సందర్భంగా రవి నా తమ్ముడు అని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఇక శ్రీరామ్‌ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు విశ్వ. తన హార్ట్ కి కనెక్ట్ అయిన వ్యక్తి అని, జెన్యూన్‌ పర్సన్‌ అని చెప్పాడు. తనకు తమ్ముడు లేడని, శ్రీరామ్‌లో తమ్ముడిని చూసుకుంటున్నానని తెలిపారు. ఈ సందర్భంగా అందరికి ఆల్‌ ది బెస్ట్ చెప్పాడు విశ్వ. 

also read: మానస్‌తో ప్రియాంక పెళ్లికి ఒప్పుకోను.. కానీ దగ్గరుండి పెళ్లి చేస్తా.. మానస్‌ తల్లి ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

Latest Videos

click me!