మానస్‌తో ప్రియాంక పెళ్లికి ఒప్పుకోను.. కానీ దగ్గరుండి పెళ్లి చేస్తా.. మానస్‌ తల్లి ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

First Published | Nov 7, 2021, 7:45 PM IST

బిగ్‌బాస్‌ తెలుగు 5లోనూ ప్రేమ జంట పుట్టింది. ప్రియాంక, మానస్‌ ప్రేమలో ఉన్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా? అనే వార్తలు కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీరిద్దరి లవ్‌ స్టోరీపై, మ్యారేజ్‌ వార్తలపై మానస్‌ తల్లి, నటి పద్మిని స్పందించింది. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
 

బిగ్‌బాస్‌(Bigg Boss)లో ప్రేమ జంటలు పుట్టడం సర్వసాధారణమే. మొదటి నుంచి ఇలాంటి లవ్‌ స్టోరీలు పుడుతూనే ఉన్నాయి. కానీ రియల్‌ లైఫ్‌లో మ్యారేజ్‌ దాకా వెళ్లింది ఒక్కటి కూడా లేదు. కేవలం బిగ్‌బాస్‌ షో వరకే ఆ లవ్‌ స్టోరీలు పరిమితం అవుతున్నాయి. రాహుల్‌ సింప్లిగంజ్‌, పునర్నవి జోడి, అలాగే అఖిల్‌, మోనాల్‌ జోడీలే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5)లో మరో జంట రెడీ అవుతుంది. మానస్‌-ప్రియాంక సింగ్‌ (Manas-Priyanka Singh)ల మధ్య ప్రేమ కథ నడుస్తుంది. 
 

గత ఎపిసోడ్‌ రాత్రి Priyanka కన్నీళ్లు పెట్టుకుంది. దేవుడు తనకు మంచి లైఫ్‌ ఇచ్చి ఉంటే బాగుండేదని, అప్పుడు మానస్‌తో హ్యాపీగా ఉండేదాన్ని అని తెలిపింది. Manasతో ఈ విషయాన్ని చెబుతూ ఎమోషనల్‌ అయ్యింది. దీంతో మానస్‌ని ఆమెని ఓదార్చాడు. సర్దిచెప్పాడు. చూస్తుంటే వీరిద్దరి మధ్య ప్రేమ కథ మరింత దూరంగా వెళ్తుందనిపిస్తుంది. మానస్‌పై పింకీ మరింతగా ప్రేమని పెంచుకుంటుంది. అయితే వీరిద్దరు పెళ్లిచేసుకుంటారా? అనే వార్తలు కూడా ఊపందుకున్నాయి. 


ఈ నేపథ్యంలో తాజాగా మానస్‌ తల్లి, నటి పద్మిని స్పందించింది. ప్రియాంక సింగ్‌పై ఆమె ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేసింది. `పింకీ చాలా మంచి అమ్మాయి, నాకెంతో ఇష్టం. ఓసారి ప్రియాంక.. మానస్‌ను హజ్బెండ్‌ మెటీరియల్‌ అంది. కానీ, మానస్‌ ఆమె కేవలం మరదలని చెప్పాడు. బిగ్‌బాస్‌ అనేది 110 రోజుల ఆట. ఈ షోలో ఎంతమంది జంటలు బయటకొచ్చారు? ఎంతమంది పెళ్లిళ్లు చేసుకున్నారు? ఏదైనా బిగ్‌బాస్‌ షో వరకే అని అందులో ఉన్న కంటెస్టెంట్లకు బాగా తెలుసు.
 

 కాకపోతే హౌస్‌లో ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. హౌస్‌లో మానస్‌కు ఎవరూ సెట్‌ కారు. నేను ఎవర్ని వేలు పెట్టి చూపిస్తే మానస్‌ ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. ప్రియాంక సింగ్‌.. నా కొడుకును పెళ్లి చేసుకుంటానంటే మాత్రం ఒప్పుకోను. ఆమెను తగిన అబ్బాయిని చూపించి పెళ్లి చేస్తా. అలా ప్రియాంకకు నేను సపోర్ట్‌ చేస్తాను, ఏదైనా సాయం చేస్తా` అని చెప్పింది.

మానస్‌ ఫస్ట్‌ లవ్‌ గురించి మాట్లాడుతూ.. మానస్‌ చదువుతున్న సమయంలో ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళ్లిపోవడానికి రెడీ అయింది. దీంతో ఏం చేయాలని నన్ను అడిగాడు. నీదింకా చిన్న వయసు. కరెక్ట్‌గా సెటిల్‌ అవకుండా అమెరికా వెళ్లడం కరెక్ట్‌ కాదేమోనన్నాను. మానస్‌ సరేనని ఆగిపోయాడు. అలా కెరీర్‌ మీద ఫోకస్‌ పెట్టాడు` అని తెలిపింది పద్మిని. మానస్‌ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. 

also read: Bigg Boss Telugu 5: విశ్వ హీరోని చేసి పింకీని విలన్‌గా మార్చేశారు.. కమెడీయన్‌ సన్నీ.. రివేంజ్‌ మామూలుగా లేదుగా

Latest Videos

click me!