గామి ప్రీమియర్ రివ్యూ: విశ్వక్ సేన్ కి హిట్ పడిందా? ఆడియన్స్ ఏమంటున్నారు? మూవీలో హైలెట్స్ ఇవే! 

First Published | Mar 8, 2024, 6:11 AM IST

విశ్వస్ సేన్ గత చిత్రాల్లో ఎన్నడూ లేని బజ్ గామి పై ఏర్పడింది. దీన్ని భారీగా ప్రమోట్ చేయడం కూడా ఒక కారణం. అలాగే చిత్ర ప్రోమోలు ఆకట్టుకున్నాయి. మరి గామి థియేటర్స్ లోకి వచ్చేసింది. టాక్ ఏమిటో చూద్దాం... 
 

Gaami Review

విశ్వక్ సేన్ హీరోగా యంగ్ డైరెక్టర్ విద్యాధర్ కాగిత ట్ తెరకెక్కించిన చిత్రం గామి. కార్తీక్ శబరీష్ గామి చిత్ర నిర్మాతగా ఉన్నారు.  టైటిల్ తోనే ఆసక్తి రగిలించారు. ఇక విశ్వక్ సేన్ లుక్, క్యారెక్టరైజేషన్, సబ్జెక్టు భిన్నంగా ఉన్నాయి. గామి చిత్రాన్ని ఏకంగా ప్రభాస్ ప్రోమోట్ చేశారు. ట్రైలర్ చూసి అద్భుతంగా ఉంది అంటూ కితాబు ఇచ్చాడు. 
 

Gaami Review

అలాగే టాలీవుడ్ యంగ్ హీరోలు గామి చిత్ర ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. ట్రైలర్ సైతం ఆకట్టుకున్న నేపథ్యంలో ఆడియన్స్ కి సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఏదో ఒక డిఫరెంట్ మూవీ చూడబోతున్నాం అన్న భావన కలిగింది. అది అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపించింది. గామి చిత్ర ఆన్లైన్ బుకింగ్స్ చాలా ఆశాజనకంగా ఉన్నాయి. 


Gaami Review

అసలు ఈ గామి చిత్ర కథ ఏమిటంటే.. అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంటాడు అఘోర(విశ్వక్ సేన్). అతడు ఇతర మనుషులను తాకలేడు. మానవుల స్పర్శ వలన అతని శరీరం రోగగ్రస్తం అవుతుంది. ఈ సమస్య నుండి బయటపడాలంటే ఒకటే మార్గం ఉంటుంది. 36 ఏళ్లకు ఒకసారి హిమాలయాల్లో పూసే పూవులు కావాలి. 

Gaami Review


ఆ పూల కోసం గాయపడ్డ శరీరంతో అఘోర మంచు కొండల మధ్య సాహస యాత్రకు పూనుకుంటాడు. మరి అతడి లక్ష్యం నెరవేరిందా? ఆ సమస్య నుండి బయటపడ్డాడా? అసలు ఈ అఘోరా నేపథ్యం ఏమిటీ? ఆ వ్యాధి రావడానికి కారణం ఏమిటీ? అనేది మిగతా కథ.. 
 

Gaami Review

యూఎస్ లో గామి చిత్ర ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మెజారిటీ ప్రేక్షకులు గామి పట్ల పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. గామి ఫస్ట్ హాఫ్ అద్బుతంగా ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం డ్రాగ్ అయ్యిందనే భావన వ్యక్తం చేస్తున్నారు. 

Gaami Review

విజువల్స్ గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో ఈ రేంజ్ విజువల్స్, ఉన్నత ప్రమాణాలు ఊహించలేం అంటున్నారు. సాంకేతికంగా సినిమా రిచ్ గా ఉంది. నరేష్ కుమరన్ ఇచ్చిన మ్యూజిక్, బీజీఎమ్ పట్ల ఆడియన్స్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Gaami Review

ఇక విశ్వక్ సేన్ ఈ చిత్రం కోసం పడ్డ కష్టం తెరపై కనిపించిందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. విశ్వక్ సేన్ నటన సినిమాకు మరో హైలెట్ అని చెప్పుకోవచ్చట. కీలక రోల్ చేసిన తెలుగు అమ్మాయి చాందిని చౌదరి మెప్పించిందని ప్రీమియర్ టాక్. 

Gaami Review

మొత్తంగా గామి ఈ వీకెండ్ కి చూసి ఎంజాయ్ చేయదగ్గ చిత్రం. ఫస్ట్ హాఫ్ బాగుంది. విజువల్స్, బీజీఎమ్  , విశ్వక్ నటన, సినిమాటోగ్రఫీ ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతాయని ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. 

Latest Videos

click me!