Published : Dec 20, 2025, 11:44 AM ISTUpdated : Dec 20, 2025, 11:45 AM IST
పెద్ది సినిమాని కించపరిచేలా కొందరు యూట్యూబర్లు కామెంట్స్ చేశారు. ఆ యూట్యూబర్లకు క్రేజీ హీరో విశ్వక్ సేన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన పెద్ది సాంగ్ 100 మిలియన్లకు పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. టీజర్ కూడా ఒక రేంజ్ లో వైరల్ కావడంతో అంచనాలు ఈ చిత్రంపై భారీ స్థాయిలో ఉన్నాయి.
25
పెద్దిపై యూట్యూబర్ల కామెంట్స్
ఈ చిత్రంలో రాంచరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలలో పెద్ది కూడా ఒకటి. గేమ్ ఛేంజర్ చిత్రం నిరాశపరచడంతో పెద్ది మూవీతో బలంగా కొట్టాలని రాంచరణ్ డిసైడ్ అయ్యారు. అయితే యూట్యూబ్ లో చాలా మంది యూట్యూబర్లు సినిమా రివ్యూలు చెప్పడం చూస్తూనే ఉన్నాం. అలాంటి యూట్యూబర్లు కొందరు ఆన్లైన్ లో మీట్ అయ్యారు. సినిమాల గురించి చర్చించుకునే క్రమంలో రాంచరణ్ పెద్ది మూవీ గురించి చీప్ కామెంట్స్ చేశారు.
35
చికిరీలు గికిరీలు అంటూ హేళనగా
పెద్ది చిత్రాన్ని కించపరిచేలా కామెంట్స్ చేశారు. ఓ యూట్యూబర్ మాట్లాడుతూ.. మీకు పెద్ది సినిమా స్టోరీ తెలుసా ? నాకు తెలుసు అని అన్నాడు. మరో యూట్యూబర్.. నువ్వు లీకులు చేయకు అని అందరూ నవ్వేశారు. నేను లీక్ చేయను.. చేస్తే నామీద కేసు వేస్తారు. స్టోరీ చెప్పొద్దు కానీ ఎలా ఉందో చెప్పు అని ఇతర యూట్యూబర్లు అడిగారు. నాకు ఏంట్రా ఇది అని అనిపించింది. ఈ స్టోరీతో ఇంత పెద్ద సినిమా తీస్తున్నారు, మళ్ళీ చికిరీలు గికిరీలు అంటూ అని హేళనగా మాట్లాడారు.
యూట్యూబర్లు ఇలా మాట్లాడడం క్రేజీ హీరో విశ్వక్ సేన్ కి ఆగ్రహం తెప్పించింది. దీనితో ఆయా వీడియో క్లిప్ ని షేర్ చేస్తూయూట్యూబర్లకు స్ట్రాంగ్ గా ఇచ్చిపడేశాడు. ''ఇలాంటి వాళ్ళని సినిమాకి పరాన్నజీవులు అని పిలవడం సమంజసమే. వీళ్లంతా సినిమా ఇండస్ట్రీ నుంచి లాభం పొందుతున్నారు. వాళ్ళ కుటుంబాలని సినిమాలు ద్వారానే పోషిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా రిలీజ్ కాని సినిమానే చంపేయాలని చూస్తున్నారు. ఇది వాళ్ళు తినే ప్లేట్ లో వాళ్లే ఉమ్మేసుకుంటున్నట్లు ఉంది'' అని విశ్వక్ సేన్ ఘాటుగా ఇచ్చిపడేశారు.
55
పెద్ది రిలీజ్
సినిమా కోసం ఎంతకైనా పోరాడేవారిలో విశ్వక్ సేన్ ఒకరు అని గతంలో కూడా ప్రూవ్ అయింది. వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ విశ్వక్ సేన్ తన వాదనని బలంగా వినిపిస్తుంటారు. ఇక పెద్ది చిత్రం 2026 మార్చి 27న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.