ఫలక్ నుమా దాస్, హిట్, ఈ నగరానికి ఏమైంది లాంటి చిత్రాలతో యంగ్ హీరో విశ్వక్ సేన్ యువతకు చేరువయ్యాడు. విభిన్నమైన యాటిట్యూడ్ తో యూత్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల టీవీ యాంకర్ తో జరిగిన వివాదంతో విశ్వక్ సేన్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాను నటిస్తున్న 'అశోక వనంలో అర్జున కళ్యాణం' చిత్ర ప్రమోషన్ కోసం ఫ్రాంక్ వీడియో చేయగా అది వివాదంగా మారింది.
ఏది ఏమైనా సినిమాకు మంచి పబ్లిసిటీ మాత్రం వచ్చింది. విశ్వక్ సేన్ కి రుక్సార్ దిల్లోన్ జంటగా నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్ద వివాదం తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో అందరిలో క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు మొదలు కావడంతో ట్విట్టర్ లో ఈ చిత్రానికి ఎలాంటి టాక్ వస్తుందో చూద్దాం.
ప్రీమియర్ షోల నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. విశ్వక్ సేన్ లాంటి రెబల్ యాటిట్యూడ్ ఉన్న నటుడు అమాయకుడిగా నటించడం కొత్తగా అనిపించిందని అంటున్నారు. సినిమా మొత్తం ఫన్నీగా సాగుతూ ఉంటుంది.
బోర్ అనిపించకుండా హాయిగా నవ్వుకునే విధంగా కథా కథనాలు, డైలాగులు ఉంటాయి ,. విశ్వక్ సేన్ కి యువతలో కొంత క్రేజ్ ఉందనేది వాస్తవం. దీనికి తోడు ఈ వివాదం వల్ల చాలా మంది ఈ సినిమా చూడడానికి ఆసక్తిగా ఉన్నాం అంతో ట్విట్టర్ లో కామెంట్స్ పెడుతున్నారు.
బ్రీజీగా సాగే ఎంటర్టైనర్ అశోక వనంలో.. ఈ చిత్రంలో మనసుకి హత్తుకునే సన్నివేశాలు, హాస్యభరితమైన సీన్స్ చాలా బావున్నాయి అని నెటిజన్లు అంటున్నారు. అయితే కథ కొన్ని సినిమాలని పోలినట్లు ఉందని అంటున్నారు.
ఇక సెలెబ్రటీల నుంచి కూడా ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమా హిట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ చిత్రానికి థియేటర్స్ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ చిత్ర బాక్సాఫీస్ వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.