#NBK107:'అఖండ' తర్వాత బాలయ్య తన రేటు ఎంత పెంచారంటే?, నిర్మాత షాక్

Surya Prakash   | Asianet News
Published : May 06, 2022, 06:11 AM IST

  బాలయ్య.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ (Akhanda)సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘అఖండ’ సక్సెస్‌తో ఇండస్ట్రీ బడా హీరోలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. 

PREV
113
#NBK107:'అఖండ'  తర్వాత బాలయ్య  తన రేటు ఎంత పెంచారంటే?, నిర్మాత షాక్


సినిమా భాషలో ప్రతీ శుక్రవారం కొందరి లైఫ్ లు మలుపు తిరుగుతాయి. అది పాజిటివ్ గా కావచ్చు,నెగిటివ్ గా కావచ్చు. సినిమా పెద్ద హిట్టైతే హీరో, నిర్మాత ల రెమ్యునరేషన్స్ పెరుగుతాయి. అదే తేడా కొడితే ఒక్కసారిగా మార్కెట్ డౌన్ అవుతుంది. అప్పటిదాకా వెనకే తిరిగిన వాళ్లు కూడా ఫోన్స్ ఎత్తరు. ఇది సినిమా వాళ్ళందరికి అనుభవమే...తెలిసిన విషయమే.  బాలయ్య వంటి సీనియర్ హీరోలు ఎన్నో సూపర్ హిట్స్, డిజాస్టర్స్ చూసి వచ్చారు. వాళ్లలో పెద్దగా మార్పేమీ ఉండదు. అయితే అఖండ తర్వాత బాలయ్య రెమ్యునరేషన్ విషయం హాట్ టాపిక్ గా మారింది. 

213


అఖండ చిత్రం బాలయ్య ని నెక్ట్స్ లెవిల్ లో కూర్చోబెట్టింది. బోయపాటి శ్రీనుతో చేసిన ఈ చిత్రం హై ఎక్సపెక్టేషన్స్ తో రిలీజైంది. వాటని అందుకోవటమే కాకుండా దాటేసిందని చెప్పాలి.  దాంతో తెలుగులో ఏ సీనియర్ హీరోకు లేని క్రేజ్ బాలయ్యకు వచ్చేసింది. ఈ సినిమా బాలయ్య నెక్ట్స్ ప్రాజెక్టులకు ప్లస్ కానుంది. వాటి బిజినెస్ భారీగా జరగనుంది.

313

ఈ సినిమా మొత్తం బాలకృష్ణ వన్‌మేన్‌ షో అనే చెప్పాలి.  గ్రామ పెద్ద మురళీ కృష్ణగా, అఖండగా రెండు విభిన్న పాత్రలో కనిపించిన బాలయ్య.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు. ‘జైబాలయ్య’పాటకు ఆయన వేసిన స్టెప్పులు, అఖండ రూపంలో చేసే ఫైట్స్‌ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయి. ఈ నేపధ్యంలో సినిమా సూపర్ హిట్టైంది.  

413


అలాగే ఈ సినిమా ఓటిటిలోనూ పెద్ద హిట్టైంది. అయినా ఇంకా ఓ థియోటర్ లో ఈ సినిమా నాలుగు షోలు పడుతూండటం విశేషం. ఏకంగా 175 రోజులు థియేటర్‌లో నడిచిన సినిమాగా అఖండ నిలవనుంది.గుంటూరులోని చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్లో మాత్రం అఖండ ఇంకా నాలుగు షోలలో నడుస్తుండడం విశేషం. 

513


పైగా ప్రతీ షోకు ప్రేక్షకులు వస్తుండడంతో థియేటర్ యాజమాన్యం దీనిని 175 రోజులు నడిపనుంది.  గతంలో  సీడెడ్ ఏరియాలో బాలయ్య నటించిన 'లెజెండ్' కూడా ఇదే తరహాలో 100 రోజులు ఆడింది. ఇప్పుడు మళ్లీ ఆ క్రెడిట్ అఖండకే దక్కుతోంది.  ఇక అఖండ 103 సెంటర్లలో 50 రోజులు ఆడింది. 20కు పైగా సెంటర్లలో అఖండ 100 రోజులు పూర్తిచేసుకుంది. కర్నూలులో 100 డేస్ సెలబ్రేషన్స్ కూడా చేశారు బాలయ్య ఫ్యాన్స్.  

613


ఈ నేపధ్యంలో బాలయ్య  ప్రస్తుతం చేస్తున్న మైత్రీ మూవీస్ వారి చిత్రానికి రెమ్యునరేషన్ పెంచేస్తారని అందరూ భావించారు. సాధారణంగా ఇలాంటి హిట్ వచ్చినప్పుడు  50% నుంచి  100% తమ పే చెక్ ని పెంచుతూంటారు హీరోలు. ఇదే విషయమై నిర్మాత ...బాలయ్యని కలిసి రెమ్యునరేషన్ విషయమై మాట్లాడారట.

713


అయితే బాలయ్య ఏదో హిట్ వచ్చిందని రేటు పెంచే రకం కాదు..అలాగే ప్లాఫ్ వచ్చిందని తనను తాను తగ్గించుకునే వాడు కాదు. అందుతున్న సమాచారం మేరకు బాలయ్య ...అఖండ హిట్ తర్వాత తనను కలసిన నిర్మాతలతో అదే మాట చెప్పి, కేవలం ఒక కోటి మాత్రమే పెంచి ఇవ్వమన్నారట. దాంతో నిర్మాతలకు షాక్ అయ్యారట. 

813

ఇంతకీ బాలయ్య ఎంత తీసుకుంటున్నారు.  అంటే అఖండ చిత్రానికి 11 కోట్లు ప్లస్ జీఎస్టీ ఇచ్చారు. ఆయన ఇప్పుడు  #NBK107కు మైత్రీ మూవీస్ నుంచి 12 కోట్లు ప్లస్ జీఎస్టీ వసూలు చేసారట.  బాలయ్య తన రేటు పెంచేస్తారేమో అని భావించిన మైత్రీ వారు ఫుల్ ఖుషీ అని వినికిడి. బాలయ్యని వారంతా పొగడ్తలలో ముంచెత్తుతున్నారట. ఈ విషయమై క్లోజ్ సర్కిల్స్ లో డిస్కషన్ జరుగుతోంది.

913

సక్సెస్ ఫుల్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో  హై ఇంటెన్స్ మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు బాలయ్య.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో ప్రధాన తారాగణం పాల్గొంటుంది. NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రోల్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. 

1013

 
ఇటీవలే విడుదలైన ఈ సినిమాలో బాలయ్య ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ లుక్ చూస్తుంటే బాలయ్య ఎప్పటిలానే అదరగొట్టారు. ఇక ఈ మాస్ మసాలా మూవీలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా దునియా విజయ్ నటిస్తున్నారు. తాజాగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ, ఈ చిత్రం నుండి అతని ఫస్ట్ లుక్  విడుదల చేశారు.  పోస్టర్లో రఫ్ గానూ సీరియస్లుక్ గెటప్ లో కనిపించాడు విజయ్. 

1113


మరోవైపు ఈ సినిమాలో మరో లేడీ పవర్ ‌ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు. ఇక గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు బాలయ్య సినిమాలో హీరోను ఢీ కొట్టే  పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది.  

1213

 ఇక క్రాక్‌లో హీరోయిన్ గా నటించినశృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తోంది.   ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్, పోలీస్ ఆఫీసర్ పాత్రలు అని చెబుతున్నారు. 

1313

 మొత్తంగా ‘చెన్నకేశవరెడ్డి’ తరహాలో తండ్రి కొడుకులు నేపథ్యంలో ఈ సినిమాను పలనాడు బ్యాక్‌డ్రాప్‌లో నిజ జీవిత ఘటలన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు వేట పాలెం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.  ఒక హీరో పట్నానికి చెందిన వ్యక్తి అయితే.. మరోకరు ఊరిలో ఉన్న ’పెద్దాయన’. 

click me!

Recommended Stories