SVP Censor Report: సర్కారు వారి పాట సెన్సార్ రిపోర్ట్.. ఫ్యాన్స్ షాక్ అయ్యేలా డిటైల్స్.. మూవీ ఎలా ఉందంటే! 

Published : May 05, 2022, 10:00 PM IST

సర్కారు వారి పాట చిత్రంపై అంచనాలు ట్రైలర్ కి ముందు ట్రైలర్ తర్వాత అని చెప్పాలి. ఈ మూవీ ట్రైలర్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికుల అంచనాలు తారా స్థాయికి చేర్చించి. సినిమా పక్కా హిట్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. కాగా సర్కారు వారి పాట సెన్సార్ రిపోర్ట్ బయటికి రాగా షాకింగ్ డీటెయిల్స్ చక్కర్లు కొడుతున్నాయి.

PREV
16
SVP Censor Report: సర్కారు వారి పాట సెన్సార్ రిపోర్ట్.. ఫ్యాన్స్ షాక్ అయ్యేలా డిటైల్స్.. మూవీ ఎలా ఉందంటే! 


సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) విడుదలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండగా... చిత్ర యూనిట్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక సెన్సార్ సభ్యుల అభిప్రాయం ప్రకారం సర్కారు వారి పాట సినిమా ఎలా ఉందంటే.. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గకుండా ఉందట. 

26

మాస్ యాక్షన్ అంశాలు పుష్కలంగా ఉన్న సర్కారు వారి పాట చిత్రంలో క్లైమాక్స్ తో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ రేంజ్ లో ఉన్నాయట. మహేష్ విశ్వరూపం చూపించగా పర్ఫెక్ట్ గా కుదిరాయి అంటున్నారు. మహేష్ (Mahesh Babu) రికవరీ ఆఫీసర్ గా కనిపిస్తాడట. 
 

36


ఇక డబ్బుకు ఎంతో విలువచ్చే మహేష్ క్యారెక్టర్ కి అదిరిపోయే బ్యాక్ డ్రాప్ ఉంటుందట. మహేష్ మనీ మైండెడ్ కావడం వెనుక కారణం ఏమిటీ? ఆయన బ్యాంకులను మోసం చేసే డిఫాల్టర్ల పై ఎందుకు పగ పెంచుకున్నాడనేది ఆసక్తికర అంశమట. ఈ రివేంజ్ డ్రామాలో చక్కని సందేశం అంతర్లీనంగా చెప్పారట. 
 

46

కాగా మహేష్-కీర్తి (Keerthy Suresh)ఎపిసోడ్స్ క్లాస్ ప్రేక్షకులకు గొప్ప ట్రీట్ అంటున్నారు. రొమాంటిక్ సన్నివేశాలు తెరకెక్కించడంలో గొప్ప దిట్ట అని గీతగోవిందం మూవీతో పరుశురాం నిరూపించుకున్నాడు. సర్కారు వారి పాటలో లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ చాలా ఎంటర్టైనింగ్ సాగుతుందట. రెండున్నర గంటల సినిమాను రొమాన్స్, ఎమోషన్స్, యాక్షన్, కామెడీ కలగలిపి ఫుల్ మీల్ సిద్ధం చేశారన్న మాట వినిపిస్తోంది.

56

ఇక థమన్ సాంగ్స్ సినిమాకు మరో ప్లస్ అంటున్నారు. దాదాపు అన్ని సాంగ్స్  మంచి టైమింగ్ లో పడుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాయట. అలాగే కీలక రోల్స్ చేస్తున్న సముద్ర ఖని, సుబ్బరాజ్, అజయ్, తనికెళ్ళ భరణి, నదియా ఆకట్టుకున్నారట.

66


మొత్తంగా సర్కారు వారి పాట టాలీవుడ్ 2022కి మరొక బ్లాక్ బస్టర్ అంటున్నారు. మే 12న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata on May12th) వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. 

click me!

Recommended Stories