విష్ణుప్రియ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ గురించి ఆసక్తిరేక వ్యాఖ్యలు చేసింది. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరినీ చచ్చేవరకు ప్రేమిస్తూనే ఉంటా అని పేర్కొంది. అలా ఎందుకు అందో ఈ కథనంలో తెలుసుకోండి.
టాలీవుడ్ లో క్రేజీ ఫీమేల్ యాంకర్స్ లో విష్ణుప్రియ ఒకరు. విష్ణుప్రియ బుల్లితెరపై ఎన్నో టీవీ షోలకు హోస్ట్ గా చేశారు. యాంకర్ గా మాత్రమే కాకుండా విష్ణుప్రియ నటిగా, డ్యాన్సర్ గా కూడా తన ప్రతిభ చాటుకున్నారు. ప్రస్తుతం విష్ణుప్రియకి గ్లామరస్ బ్యూటీగా యువతలో మంచి క్రేజ్ ఉంది. తరచుగా విష్ణుప్రియ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోస్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం.
25
విష్ణుప్రియ వివాదాలు
విష్ణుప్రియ వ్యక్తిగత విషయాలు, వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్యన బెట్టింగ్ యాప్స్ వివాదంతో విష్ణుప్రియ వార్తల్లోకెక్కింది. ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ ఫొటోస్ షేర్ చేస్తూ సబ్ స్క్రిప్షన్ ద్వారా లక్షల్లో సంపాదిస్తోంది. ఇది కూడా వివాదం అయింది. ఇదిలా ఉండగా విష్ణుప్రియ గతంలో తన బాయ్ ఫ్రెండ్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
35
ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ పై కామెంట్స్
గతంలో విష్ణుప్రియ చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ తో రిలేషన్ పెట్టుకుందట. వారితో బ్రేకప్ కూడా జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా విష్ణుప్రియ రివీల్ చేసింది. బ్రేకప్ అయ్యాక మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడడం కంటిన్యూ చేశారా, తిరిగి రిలేషన్ కొనసాగించేందుకు ప్రయత్నించారా అని ప్రశ్నించగా.. విష్ణుప్రియ ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరితో నేను ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నా. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. వారిలో కొన్ని అంశాలు నచ్చడం వల్లే రిలేషన్ లో ఉన్నాను. బ్రేకప్ అయినంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదు. అలాగని ఫ్యూచర్ లో వారితో రిలేషన్ పెట్టుకోవడం కూడా కుదరదు. కానీ ఫ్రెండ్ షిప్ మాత్రం కంటిన్యూ అవుతుంది.
55
చచ్చే వరకు ప్రేమిస్తూనే ఉంటా
చచ్చే వరకు వాళ్ళని పేమిస్తూనే ఉంటా. మేము రిలేషన్ లో ఉండడానికి చాలా మంచి కారణాలు ఉన్నాయి. కేవలం కొన్ని కారణాల వల్ల విడిపోయాం అంతే అని విష్ణుప్రియ పేర్కొంది. విడిపోయినంత మాత్రాన వాళ్లపై నాకు నాపై వాళ్లకు ద్వేషం లేదు అని విష్ణుప్రియ పేర్కొంది.