
Gunde Ninda Gudi Gantalu: సత్యం రిటైర్మెంట్ డబ్బు విషయంలో మనోజ్, కల్పన చేసిన మోసాన్ని బాలు బయటపెడతాడు. సాక్షిగా కల్పనను తీసుకొచ్చి మరీ.. అసలు జరిగిన నిజమంతా బయటపెడతాడు. అది విని `ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతారు.కల్పన నిజం చెప్పిన తర్వాత కూడా.. దానిని మనోజ్, రోహిణీలు ఒప్పుకోరు. చెప్పేది అబద్ధం అని నమ్మించడానికి ప్రయత్నిస్తారు.
దీంతో... కల్పన సాక్షాలతో సహా బయటపెడుతుంది. అంతేకాదు...‘ నీ కొడుక్కి బుర్ర లేదు.. మీ కోడలు రోహిణీనే నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి.. వడ్డీకూడా లాగింది’ అని కల్పన చెబుతుంది. ఆమె ఇచ్చిన సాక్షాలను రవి చెక్ చేసి నిజమే అని చెబుతాడు. ఇక నిజం మొత్తం చెప్పేసిన తర్వాత కల్పన అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇక.. మమల్ని ఎలా మోసం చేయాలని అనిపించింది అని సత్యం చాలా బాధపడతాడు. అయితే.. ఆ డబ్బులు ఏం చేశారో అడగండి అని మనోజ్ అనడంతో... ఆ డబ్బుతోనే ఫర్నీచర్ షోరూమ్ పెట్టారా? అని సత్యం అడుగుతాడు. అవును అని రోహిణీ ఒప్పుకుంటుంది.
ఇక.. ఆ మాట విన్న తర్వాత ప్రభావతి కోపంతో ఊగిపోతుంది. మనోజ్ చొక్కా పట్టుకొని నిలదీస్తుంది. దీంతో.. మనోజ్ తన తప్పేమీ లేదని... కల్పన దగ్గర డబ్బులు తీసుకోగానే.. వాటితో షోరూమ్ పెడతామని రోహిణీ సలహా ఇచ్చిందని.. వాళ్ల నాన్న డబ్బులు ఇచ్చాడు అని చెబుదాం అందని మొత్తం రోహిణీ మీదకు తోసేస్తాడు. ఇక.. అంతే... ప్రభావతి రెచ్చిపోతుంది.
తప్పంతా రోహిణీ దే అని.. రోహిణీ పై విరుచుకుపడుతుంది. రోహిణీ చెంపలను వాయిస్తుంది. ఎందుకు ఇలా చేశావ్ అని నిలదీస్తుంది. ‘ నేను ఆ డబ్బులతో షోరూమ్ పెట్టించకపోతే మీ కొడుకు పార్క్ లో పడుకునేవాడు.. గుడి ముందు అడుక్కునేవాడు’ అని రోహిణీ ఎదురు తిరుగుతుంది. ఆ మాటకు ప్రభావతికి కోపం రెట్టింపు అవుతుంది. ఇంకా ఎక్కువ కోపంతో.. రోహిణీని చావగొడుతుంది.
అయితే... ప్రభావతి ని మీనా, శ్రుతి ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ.. ప్రభావతి ఆగదు. చావగొడుతుంది. దీంతో.. సత్యం ఆపి.. రోహిణీని లోపలికి పంపిస్తారు. ఇక.. కోడలు మీద చెయ్యి చేసుకోవడం తప్పు అని.. ప్రభావతిని కూల్ చేస్తారు. అయితే.. మనోజ్, రోహిణీ ఇద్దరూ కలిసి తప్పు చేస్తే.. రోహిణీని మాత్రమే శిక్షించడం కరెక్ట్ కాదని బాలు, మీనా, శ్రుతి, రవి అంటారు.
ఇక.. మనోజ్, రోహిణీ చేసిన మోసం గురించి, ప్రభావతి అలా రియాక్ట్ అవ్వడం చూసి బాలు, మీనా, రవి, శ్రుతి షాక్ అవుతారు. రోహిణీని అత్తయ్య ఇలా కొడతారు అని నేను అనుకోలేదు అని మీనా అంటే... ఇద్దరూ కలిసి తప్పు చేస్తే.. రోహిణీని మాత్రమే కొట్టడం మంచిది కాదు అని శ్రుతి అంటుంది. మనోజ్ మంచి భర్త కాదని... అత్తయ్య రోహిణీని కొడుతుంటే ఆపలేదు అని శ్రుతి అంటే.. వదిన కూడా... మనోజ్ అన్నయ్యను అలా తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు అని రవి అంటాడు. ‘ వాడంటే మా అన్నయ్య కాబట్టి.. నేను ఎన్ని మాటలు అయినా అంటాను.. భర్తకు పార్లరమ్మ గౌరవం ఇవ్వాలి కదా.. అందరి ముందు అలా మాట్లాడుతుందా? మొన్నటి వరకు అన్నింటికీ వెనకేసుకు వచ్చేది.. ఇప్పుడేమో.. ఇలా తిడుతోంది’ అని బాలు అంటాడు. ఆ మాటలు దూరం నుంచి విన్న మనోజ్ కూడా బాధపడతాడు. ఇదే విషయం గురించి బెడ్రూమ్ లో కూర్చొని ఏడుస్తున్న రోహిణీ దగ్గరకు వెళ్లి నిలదీస్తాడు. నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడావ్ అని ఫీల్ అవుతాడు. కానీ, రోహిణీ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా.. నువ్వు చదివిన డిగ్రీలు ఎందుకూ పనికిరావు అని మరింత తక్కువ చేసి మాట్లాడుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది..