ఇక తాజా సమాచారం ప్రకారం వీరు స్క్రీన్ మీద మరసారి జంటగా కనిపించబోతున్నారట. ఇద్దరి కాంబినేషరన్ లో ఓ సాంగ్ రాబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఓ రొమాంటిక్ సాంగ్ ను వీరు చేయబోతున్నారని సమాచారం. గతంలో విష్ణు ప్రియ మానస్ కాంబోలో ఓ సాంగ్ వచ్చింది. అది సూపర్ హిట్ అయ్యింది.
ఇక బిగ్ బాస్ హౌస్ లో కెమిస్ట్రీ అద్బుతంగా వర్కౌట్ అయిన పృధ్వీ-విష్ణుప్రియలు కలిసి సాంగ్ చేస్తే.. అది మరింత వైరల్ అవ్వడం ఖాయం. అయితే ఈ విషయం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అయ్యింది. అఫీషియల్ గా మాత్రం ఎవరు ప్రకటించలేదు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటించే వరకూ చూడాల్సిందే.