డైరెక్ట్ గా వచ్చి మన పెళ్లి సంగతేంటని అడిగాడు. మనంపెళ్లి చేసుకోవాలంటే ముందు మా అమ్మా నాన్న కలవాలి అంటుంది వర్ష. దీంతో అమ్మానాన్నలు రాగా, వాళ్లు కలవమంటే కలవము అని తేల్చారు. ఇక ఆగలేక.. `ఇన్ని సంవత్సరాలుగా నిన్ను కించపరిచే వాడి కోసం పరితపించిపోయి, ఏమన్నా నువ్వు అర్థం చేసుకుని వదిలేస్తున్నావ్. అలాంటిది నా గురించి ఒక్క సారి ఆలోచించొచ్చు కదా.
ఈ సెట్ సాక్షిగా అడుగుతున్నా, నాతో వస్తావా అంటూ ప్రపోజ్ చేశాడు. దీంతో వర్షతోపాటు అంతా షాక్ అయ్యారు. ఇమ్మాన్యుయెల్‌ని కాదని మరో అబ్బాయిని తీసుకురావడం పట్ల అంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షకి ఇమ్మాన్యుయెల్ సరైన జోడీ అని అంటున్నారు. కొత్త కుర్రాడిని యాక్సెప్్ట చేయడం లేదు.