జనసేన పార్టీలో చేరడంపై మంచు మనోజ్‌ ఫస్ట్ రియాక్షన్‌, తండ్రీకొడుకులు చేసిన పనికి ఈ నిర్ణయం?

First Published | Dec 17, 2024, 7:59 AM IST

మంచు మనోజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని, జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై మనోజ్‌ ఫస్ట్ టైమ్‌ రియాక్ట్ అయ్యాడు. 
 

మంచు ఫ్యామిలీ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మంచు మనోజ్ విషయంలో అటు తండ్రి మోహన్‌బాబు, అన్న మంచు విష్ణు వ్యవహరిస్తున్న తీరు వివాదంగా మారుతూనే ఉంది. లేటెస్ట్ గా మంచు మనోజ్ ఇంట్లోని జనరేటర్‌లో విష్ణు చక్కర పోయడం మరింత వివాదంగా మారింది. ఈ చర్య వారి మధ్య గొడవని మరింతగా పెంచుతుంది. ఈ విషయంలో ఎవరూ తగ్గడం లేదనిపిస్తుంది. తండ్రీ కొడుకులు(మోహన్‌బాబు, విష్ణు) కలిసి మంచు మనోజ్‌ని టార్గెట్‌ చేశారని అనిపిస్తుంది. 

read more: చిరంజీవికి గాలం వెయ్యాలనే ఆలోచన అల్లు రామలింగయ్యది కాదా? తెరవెనుక ఉన్న ఆ లేడీ ఎవరు?
 

ఇదిలా ఉంటే మంచు మనోజ్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు మోహన్‌బాబు ఫ్యామిలీ వైఎస్‌ఆర్సీపీకి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు టీడీపీలో ఉన్నారు మోహన్‌బాబు. రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు.

గతసారి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆయన పార్టీ మారాడు. వైసీపీలోకి చేరారు. ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ గా ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇటీవల సీఎం చంద్రబాబునాయుడిని కలవడంతో ఈ ఊహానాలు ప్రారంభమయ్యాయి. 

Tap to resize

ఈ క్రమంలో ఇప్పుడు మంచు మనోజ్‌ రాజకీయ ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తుంది. ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పార్టీ జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. సుమారు వెయ్యి కార్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ జనసేనలో చేరాలని మనోజ్‌ నిర్ణయించుకున్నారని త్వరలోనే ఈ కార్యక్రమం ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై మంచు మనోజ్‌ స్పందించారు.

జనసేనలో చేరడంపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. అయితే దీనిపై ఆయన `నో కామెంట్‌` అని చెప్పడం ఆశ్చర్యపరుస్తుంది. అదే సమయంలో సరికొత్త అనుమానాలను రేకెత్తిస్తుంది. మనోజ్‌ ఈ వార్తలను ఖండించలేదు. కేవలం నో కామెంట్‌ అనే పదం మాత్రమే వాడాడు. అంటే ఆయన ఆ ఆలోచనలో ఉన్నారనేది స్పష్టమవుతుంది. 

also read: యష్మిపై ఫీలింగ్స్ నిజమే, కానీ ఆ రోజు నన్ను అన్న మాటతో.. గౌతమ్‌ డేరింగ్‌ కామెంట్స్

తన విషయంలో తండ్రీ కొడుకు మోహన్‌బాబు, విష్ణులు చేస్తున్న పనులు, తనని దూరం పెట్టే చర్యలు మనోజ్‌ ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తుంది. నిన్న సోమవారం మనోజ్‌ భార్య మౌనికా రెడ్డి అమ్మ శోభా నాగిరెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలోని ఆమె సమాధిని సందర్శించారు మనోజ్‌, మౌనికా రెడ్డి.

తన కూతురు దేవసేన శోభ జన్మించిన తర్వాత ఎప్పుడూ రాలేదని, మొదటిసారి కూతురుని తీసుకుని ఇక్కడకు రావడం ఆనందంగా ఉందని మనోజ్‌ తెలిపారు. ఫ్యామిలీతోపాటు, తన అనుచరులు, ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చినట్టు తెలిపారు మనోజ్‌. ఈ సందర్భంగా రాజకీయ ఎంట్రీపై ఆయన నో కామెంట్ అన్నాడు. 

Manchu Manoj

ఇక మంచు మనోజ్‌.. మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కూతురు జన్మించింది. పెళ్లి సమయంలోనే కొడుకుతో వచ్చింది మౌనికా. అతను తన మొదటి భర్తకు జన్మించాడు. భార్యగా ఆమెని స్వీకరించడంతోపాటు కొడుకుని స్వీకరించాడు మనోజ్‌. ఇదే మోహన్‌బాబుకి నచ్చడం లేదని, ఇక్కడి నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయని తెలుస్తుంది.

ప్రస్తుతం మనోజ్‌ ఉంటున్నది జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంట్లో. తన ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారట.ఈ విషయంలోనే గొడవ జరుగుతుందని టాక్‌. మరి ఈ వివాదం ఎటు వైపు వెళ్తుంది? ఎప్పుడు ముగుస్తుందో చూడాలి. 

read more: ఈ ఏడాది తెరపై కనిపించని హీరోలు

Latest Videos

click me!