శ్రీవిష్ణు, నయన సారిక జంటగా నటించిన `విష్ణు విన్యాసం` మూవీ ఈ శుక్రవారం విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి మొదటి రోజు ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే.
శ్రీవిష్ణు.. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్‌మెంట్ ట్యాగ్‌ని సొంతం చేసుకున్నారు. వినోదాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. తాను చేసిన సినిమాల్లో ఎక్కువగా లవ్ స్టోరీస్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న చిత్రాలే ఉంటాయి. చిన్న కాన్సెప్ట్ తో, దాని చుట్టూ మంచి వినోదాన్ని అల్లుకుని సినిమాలు తీస్తూ హిట్లు కొడుతున్నాడు. ఇప్పుడు `విష్ణు విన్యాసం` మూవీతో వచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి కొంత డివైడ్ టాక్ వచ్చింది.
24
తన భుజాలపై సినిమాని నడిపించిన శ్రీవిష్ణు
యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన `విష్ణు విన్యాసం` మూవీలో శ్రీవిష్ణుకి జోడీగా నయన సారిక హీరోయిన్‌గా నటించింది. సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, గోపరాజు రమణ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎంటర్‌టైన్‌మెంట్‌ని బేస్ చేసుకుని ఈ చిత్రం రూపొందింది. శ్రీవిష్ణు తన భుజాలపై వేసుకుని సినిమాని నడిపించారు. ట్రెండీ కామెడీ, జెంజీ డైలాగ్‌లతో ఆకట్టుకున్నాడు. అయితే కొంత నెగటివ్ టాక్ వచ్చింది.
34
విష్ణు విన్యాసం కలెక్షన్లు
మరి ఈ మూవీ కలెక్షన్ల పరంగా ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుంది. సినిమా బాక్సాఫీసు వద్ద ఏ రేంజ్‌లో సత్తా చాటుతుందనేది చూస్తే, మొదటి రోజు డీసెంట్ కలెక్షన్లు వచ్చాయి. ఇండియాలో రెండు కోట్లు వసూలు చేస్తే, ఓవర్సీస్‌లో కలిపి మొత్తం రూ.3.25కోట్లు రాబట్టింది. మొత్తంగా దాదాపు కోటిన్నరకుపైగా షేర్ సాధించింది. రెండో రోజు ఇప్పటికే కోటి వరకు రాబట్టినట్టు సమాచారం. ఈ వీకెండ్ మాత్రం సినిమా బాగానే ఆడేలా ఉంది. ఆ తర్వాత ఎలా ఉంటుందనేది చూడాలి. ఆడియెన్స్ కి కామెడీ కనెక్ట్ అయితే ఆడుతుంది. లేదంటే సోమవారం నుంచి పడిపోతుందని చెప్పొచ్చు.
విష్ణు విన్యాసం.. బిజినెస్, బ్రేక్ ఈవెన్ లెక్కలు
`విష్ణు విన్యాసం` మూవీకి దాదాపు రూ.20కోట్ల బడ్జెట్ అయ్యింది. థియేట్రికల్ బిజినెస్ ని రూ.12కోట్లుగా వెలకట్టారు. నాన్ థియేట్రికల్‌గా దీనికి రూ.16కోట్ల వరకు వచ్చిందని సమాచారం. ఈ లెక్కన ఇప్పటికే నిర్మాతలకు రూ.28కోట్లు వచ్చింది. ఎనిమిది కోట్లు లాభాల్లో ఉన్నారు. కానీ థియేట్రికల్‌గా సినిమా ఏ రేంజ్‌లో సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారింది. థియేటర్ నుంచి రూ.24కోట్ల గ్రాస్ వసూలు చేస్తే, బయ్యర్లు సేఫ్ లేదంటే నష్టాలు తప్పవు. మరి ఆ టార్గెట్‌ని రీచ్ అవుతుందా అనేది చూడాలి.