ప్రభాస్ 'స్పిరిట్'పై కొత్త రచ్చ.. దీపిక తర్వాత ఇప్పుడు ప్రకాశ్ రాజ్.. అసలేం జరుగుతోంది?

Published : Feb 28, 2026, 01:08 PM IST

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీస్తున్న పాన్ ఇండియా సినిమా 'స్పిరిట్' చుట్టూ రోజూ ఏదో ఒక వివాదం నడుస్తోంది. మొదట దీపికా పదుకొణె తప్పుకోగా, ఇప్పుడు ప్రకాశ్ రాజ్ కూడా సినిమా నుంచి బయటకు వెళ్లారన్న వార్త అందరినీ షాక్‌కు గురిచేసింది.

PREV
15
'స్పిరిట్' నుంచి ప్రకాశ్ రాజ్ ఔట్?

మొదటి నుంచి జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ రాజ్‌ను 'స్పిరిట్'లో కీలక పాత్ర కోసం తీసుకున్నారని వార్తలొచ్చాయి. కానీ, క్రియేటివ్ డిఫరెన్సెస్  కారణంగా ఆయన్ని సినిమా నుంచి తొలగించారని తర్వాత ప్రచారం జరిగింది. తాజాగా వచ్చిన అప్‌డేట్ ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది.

25
'స్పిరిట్' స్టార్ కాస్ట్‌లో ప్రకాశ్ రాజ్ పేరు మిస్సింగ్

శుక్రవారం 'స్పిరిట్' మేకర్స్ సినిమా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇది వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్. ఇందులో డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్లు, ప్రధాన తారాగణం పేర్లను కూడా ప్రకటించారు. కానీ, ఈ లిస్ట్‌లో ప్రకాశ్ రాజ్ పేరు కనిపించలేదు. దీంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారని చాలామంది ఫిక్స్ అయ్యారు. అయితే, దీనిపై మేకర్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

35
వదంతులపై స్పందించిన ప్రకాశ్ రాజ్

క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల 'స్పిరిట్' నుంచి తప్పుకున్నాననే వార్తలను ప్రకాశ్ రాజ్ X (ట్విట్టర్) లో ఖండించారు. '#Spirit సినిమాపై విషపూరిత ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న వారికి చెబుతున్నా.. నా సీన్ల షూటింగ్ ఇంకా మొదలే కాలేదు. అప్పుడే మీరు వాట్సాప్ ఫ్యాక్టరీలా కథలు అల్లేస్తున్నారు. కాస్త మెచ్యూర్డ్‌గా ఉండండి, మీ పని మీరు చూసుకోండి. #justasking' అని ఆయన పోస్ట్ చేశారు.

45
దీపికా పదుకొణె కారణంగా వివాదాల్లో 'స్పిరిట్'

నిజానికి 'స్పిరిట్' సినిమా దీపికా పదుకొణె విషయంలోనే మొదట వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన దీపిక, తర్వాత ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. తల్లి అయ్యాక, తాను రోజుకు 8 గంటల షిఫ్ట్‌లో మాత్రమే పనిచేస్తానని ఆమె కండిషన్ పెట్టారని వార్తలొచ్చాయి. ఈ షరతుకు డైరెక్టర్ ఒప్పుకోకపోవడంతో దీపిక సినిమాను వదులుకున్నారని, ఆమె స్థానంలో తృప్తి డిమ్రిని తీసుకున్నారని ప్రచారం జరిగింది. 

55
ప్రభాస్ 'స్పిరిట్' ఎప్పుడొస్తుందంటే?
'స్పిరిట్' సినిమాలో ప్రభాస్, తృప్తి డిమ్రి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇండియన్ సినిమాలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఇదీ ఒకటి. మార్చి 2027లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనిపై వస్తున్న వివాదాలు కూడా హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.
Read more Photos on
click me!

Recommended Stories